పదోతరగతి అర్హత.. హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే

by Vinod kumar |   ( Updated:2023-04-24 14:36:48.0  )
పదోతరగతి అర్హత.. హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే
X

దిశ, కెరీర్: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) .. గ్రూప్- సి కేటగిరిలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) - 217

హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) - 30

మొత్తం పోస్టులు: 247

అర్హత: పోస్టులను అనుసరించి 60 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ఐటిఐ లేదా ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణతతోపాటు నిర్దష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100 ఉంటుంది.

ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, డిక్టేషన్ టెస్ట్, పేరాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ (హెచ్‌సీఆర్‌వోలకు మాత్రమే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 100 చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎంఎస్సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

చివరితేది: మే 12, 2023

రాత పరీక్ష తేదీ: జూన్ 4, 2023.

వెబ్‌సైట్: https://bsf.gov.in

ఇవి కూడా చదవండి:

ఆర్ట్ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్.. చివరితేదీ ఎప్పుడంటే..?

Advertisement

Next Story

Most Viewed