- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్మికులు బిచ్చగాళ్లు కాదు
ప్రస్తుత వ్యవస్థలో పని చేసే హక్కు, ఉద్యోగ భద్రతకు హామీ లేదు. గిగ్ వర్కర్లు, వలస కార్మికులు, ఫార్మా కంపెనీల్లో కార్మిక సంఘం ఏర్పర్చుకునేందుకు కూడా హక్కు లేదు. ఈ సారి 138వ మేడే ని భారతదేశంలో 18వ లోక్‌సభ ఎన్నికల వేళలో జరుపుకుంటున్నాం. ఈ ఎన్నికల వేళలో కార్మిక హక్కులు కాపాడకుండా రాజకీయ పార్టీల ర్యాలీలకు, సభలు నిండేందుకు కార్మికులను తరలిస్తున్నారు. నాయకులు చెప్పే అబద్ధాలకు చప్పట్లు కొట్టిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఉండాలి. కానీ ఉచిత జనాకర్షణ పథకాలతో కార్మికుల కడుపు నిండదు. పేద కుటుంబాలకు ఉచిత ఆహారం, నగదు బదిలీ వంటి హామీలతో కార్మికులను బిచ్చగాళ్ళుగా చూస్తున్నారు.
మేడే స్ఫూర్తి నెమరువేసుకుంటూనే..
భారతదేశంలో మొట్టమొదటి సారిగా చెన్నైలో 1923 మే 1న లేబర్ కిసాన్ పార్టీ అధినేత సింగర వేలర్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు జరిగాయి. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించిన తర్వాత కార్మికుల హక్కులు, పని దినాలు, బోనస్, గృహ వసతి సౌకర్యాల కోసం ఎన్నో సమ్మెలు, పోరాటాలు చేసి చట్టాలు రూపొందించుకోవడం జరిగింది. కానీ నేడు 44 కార్మిక చట్టాలను మారుస్తూ 4 లేబర్ కోడ్లుగా రూపాంతరం చెందించటంతో కార్మికులు నిరాశతో వున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్ పథకం ద్వారా, ప్రైవేటు, ప్రభుత్వ రంగ కార్మికులకు ఈపీఎఫ్ (ఎంప్లాయిస్ పెన్షన్)- 95 కనీస పెన్షన్ వెయ్యి రూపాయలతో పాటు కరువు భత్యం లేకపోవడం దురదృష్టం. బొగ్గు విశ్రాంత కార్మికుల నిరంతర ఆందోళనల ఫలితంగా కోల్ మైన్స్ పెన్షన్ స్కీం-1998 నిబంధన ప్రకారం కనీస పెన్షన్ 350 రూపాయల నుంచి వెయ్యి రూపాయలు కనీస పెన్షన్ చెల్లిస్తామని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, కరువు భత్యంతో కూడిన పెన్షన్ లేక పోవడం, చీకటి బొగ్గు పొరల్లో పగలనక, రేయనక పని చేసి దేశానికి వెలుగు ఇచ్చిన బొగ్గు విశ్రాంత కార్మికులకు అపరిమిత ఉచిత వైద్యం లేక అధికారులకు, కార్మికులకు చెల్లించే గ్రాట్యుటీ చెల్లింపులో వ్యత్యాసంతో బాధ పడుతూ గతంలో వారు మేడే స్ఫూర్తితో చేసిన పోరాటాలను నెమరు చేసుకుంటూ విగత జీవులుగా జీవిస్తున్నారు. వారి త్యాగాలను, సేవలను గుర్తించి వారికి గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు కార్మిక సంఘ నాయకులు కేవలం వేతన ఒప్పందాలకై పరిమితం కాకుడదు. పనిచేసినప్పుడు, పని దిగిపోయిన తరువాత కూడా విశ్రాంత కార్మికులను ఆదరించిన నాడే నిజమైన మేడే అని భావించాలి.
ఆళవందార్ వేణు మాధవ్
86860 51752
- Tags
- mayday