- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అమెరికా మోసానికి మరో ఉదాహరణ

ట్రంప్ పాలనలో అమెరికా మీద ఆశలు పెట్టుకోవడం మానేయాలని, యూరప్ దేశాలు తమ భద్రత కోసం సొంత సైన్యం (యూరోపియన్ ఆర్మీ) ఏర్పాటు చేసుకోవాలని జెలెన్ స్కీ పిలుపునిచ్చాడు. ఇటీవల ట్రంప్, పుతిన్‌తో మాట్లాడిన తర్వాత ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, యూరప్ దేశాలను సంప్రదించకుండా ట్రంప్ పుతిన్‌తో చర్చలు జరపడం ఈ నిర్ణయానికి దారి తీసింది.
"యూరప్ భద్రతకు ప్రమాదం వాటిల్లే అంశాల్లో అమెరికా 'నో' చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు యూరప్ తన సైనిక శక్తిని పెంచుకోవాలి" అని జెలెన్ స్కీ వ్యాఖ్యానించాడు. అంతేకాదు, ఉక్రెయిన్‌ని పక్కన పెట్టి ఎలాంటి ఒప్పందాలూ జరగవని స్పష్టం చేశాడు. "ఉక్రెయిన్ లేకుండా ఉక్రెయిన్ గురించి నిర్ణయాలు తీసుకోలేరు. యూరప్ లేకుండా యూరప్ భద్రతపై నిర్ణయాలు తీసుకోలేరు."
యుద్ధం కొనసాగుతుండగానే..
అమెరికా ఉక్రెయిన్‌కి నాటో సభ్యత్వం కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ రష్యా దీన్ని వ్యతిరేకించింది. అయినా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్ స్కీ రష్యా హెచ్చరికలను పట్టించుకోకుండా నాటో సభ్య త్యం కావాలనుకున్నాడు . ఫలితంగా రష్యా ఉక్రెయి న్‌పై యుద్ధాన్ని ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచారు. నాటో దేశాలు ఆర్థిక, సైనిక సహాయం అందించాయి. ఈ మద్దతుతోనే ఉక్రెయిన్ మూడు సంవత్సరాలుగా రష్యా దాడులను ఎదుర్కొంటూ పోరాడుతోంది. అయితే ఈ యుద్ధం కొనసాగుతుండగానే కీలక మార్పు చోటుచేసుకుంది. బైడెన్ స్థానంలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు. దీంతో గతంలో ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని చెప్పిన అమెరికా ఇప్పుడు వెనక్కి తగ్గింది. ట్రంప్, బైడెన్‌కి భిన్నంగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌తో స్నేహం పెంచుకున్నాడు. అమె రికా మద్దతు లేకుండా ఉక్రెయిన్‌కి యుద్ధం కొనసాగించడం అసాధ్యం. ట్రంప్ తన పదవిని చేపట్టిన వెంటనే పుతిన్‌తో 90 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడాడు. ఆ తర్వాత జెలెన్ స్కీ చేసిన వ్యాఖ్యల స్వరం ఆయన నొప్పిని స్పష్టంగా వెల్లడించింది.
ఉక్రెయిన్‌ని నిలబెట్టింది ఎవరు?
ఫిబ్రవరి 24న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మూడేళ్లు పూర్తవుతోంది. ప్రారంభంలో చాలా మంది ఉక్రెయిన్ త్వరగా ఓడిపోతుందని భావించారు. కానీ అమెరికా, యూరప్ దేశాల మద్దతుతో ఉక్రెయిన్ గట్టిగా ఎదురు తిరిగింది. రష్యా యుద్ధం ప్రారంభించిన తొలి ఆరు నెలల్లో 1,19,000 చదరపు కిలోమీటర్ల ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించింది. క్రిమియాతో పాటు ఇతర ఆక్రమిత ప్రాంతాలను కలిపి చూస్తే మొత్తం 1,61,000 చదరపు కిలోమీటర్ల భూమి రష్యా ఆధీనంలోకి వెళ్లింది. ఇది ఉక్రెయిన్ భూభాగంలో దాదాపు 27 శాతం. కానీ ఉక్రెయిన్ 74,443 చదరపు కిలోమీటర్ల భూమిని తిరిగి సాధించింది. అయినప్పటికీ ఇప్పటికీ 18 శాతం భూభాగం రష్యా చేతిలోనే ఉంది. ఈ యుద్ధంలో 6 లక్షల రష్యా సైనికులు మరణించారని ఉక్రెయిన్ చెబుతోంది. అసలు ప్రపంచంలోనే రెండో అగ్రశక్తిగా చెప్పుకునే రష్యా ఇంతవరకు ఉక్రెయిన్‌ను పూర్తిగా ఓడించలేకపోవడానికి ముఖ్య కారణం అమెరికా, యూరప్ దేశాల సహాయం. ఇప్పటివరకు ఈ దేశాలు కలిపి ఉక్రెయిన్‌కు రూ. 25 లక్షల కోట్లకు పైగా సహాయం అందించాయి.
ట్రంప్ రాకతో మారిన పరిస్థితి
జో బైడెన్ ఎన్నికల్లో ఓడిపోవడం ఉక్రెయిన్‌కు పెద్ద దెబ్బ. బైడెన్ హయాంలో ఉక్రెయిన్‌కు భారీ స్థాయిలో మిలిటరీ సహాయం అందింది. 2022 ఫిబ్రవరి 24 నుంచి 2025 జనవరి 9 వరకు అమెరికా ఉక్రెయిన్‌కు అందించిన మొత్తం సహాయం రూ. 5.7 లక్షల కోట్లు. పదవి నుంచి దిగిపోయే ముందు కూడా బైడెన్ ఉక్రెయిన్‌కు $500 మిలియన్ డాలర్ల ప్యాకేజీ మంజూరు చేశాడు. కానీ ట్రంప్ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ట్రంప్, పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత చేసిన వ్యాఖ్యలు ఉక్రెయిన్‌కు తీవ్రమైన ముంపు తీసుకువచ్చాయి. ట్రంప్ ప్రకటనల ప్రకారం, నాటోలో ఉక్రెయిన్ చేరడం అసాధ్యం, రష్యా ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి పొందడం దాదాపు అసాధ్యం. అంతేకాదు, బైడెన్ తరహాలో మిలిటరీ సహాయం కొనసాగించాలంటే ఉక్రెయిన్ $500 బిలియన్ విలువైన ఖనిజ సంపదను అమెరికాకు అప్పగించాలని ట్రంప్ డిమాండ్ చేశాడు. జెలెన్ స్కీ దీనిని తిరస్కరించాడు. రక్షణ నిపుణుల అంచనా ప్రకారం, ట్రంప్ మద్దతు నిలిపివేస్తే ఉక్రెయిన్ నాలుగు నుంచి ఆరు వారాలకు మించి యుద్ధాన్ని కొనసాగించలేకపోవచ్చు. అందుకే జెలెన్ స్కీ "అమెరికా మద్దతు లేకుంటే ఉక్రెయిన్ మనుగడ కష్టమే" అని బహిరంగంగా అంగీకరించాడు.
అమెరికాను నమ్మితే..
ఉక్రెయిన్‌తో పాటు యూరప్ దేశాల భద్రతలో అమెరికా వెనుకడుగు వేయడం అన్యాయమే. కానీ ఇది కొత్త విషయం కాదు. చరిత్రలో అమెరికాను నమ్మి అభివృద్ధి చెందిన దేశం ఒక్కటి కూడా లేదు. ప్రపంచంలోని అనేక యుద్ధాల వెనుక అమెరికా ఉంది. పొరుగు దేశాల మధ్య సంఘర్షణలను రెచ్చగొట్టి ఆయుధాలను అమ్మడం, యుద్ధాల ద్వారా లాభాలను అందుకోవడం అమెరికా వ్యూహం. జెలెన్ స్కీ ఈ నిజాన్ని ఆలస్యంగా గ్రహించాడు. అమెరికా మాటలు నమ్మి శత్రువైన రష్యాతో యుద్ధానికి దిగిన ఉక్రెయిన్ ఇప్పుడు ఒంట రైంది. కొత్త అధ్యక్షుడు ట్రంప్ మద్దతును ఉపసంహరించుకోవడం మరోసారి స్పష్టం చేసింది ఏమి టంటే.. అమెరికా మాటలు నమ్మి బాగుపడే దేశం మరొకటి ఉండదని.
డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్
98493 28496