- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ధాన్య భాండాగారంగా తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం అంటేనే తెగింపు, త్యాగంతో ఏర్పడిన రాష్ట్రం ఈ రాష్ట్ర ఏర్పాటులో సుదీర్ఘ పోరాటంతో రాష్ట్రాన్ని సాధించేలా చేశారు కేసీఆర్. ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారితోనూ తెలంగాణకు జై కొట్టేలా చేశారు. అదంతా కేసీఆర్ పనితీరు, నిబద్ధతకు నిదర్శనం. రాష్ట్ర గవర్నర్ పట్ల కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును విమర్శిస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఒకసారి మాజీ ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకోవాలి. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఎక్కడా కేసీఆర్ గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు.
ప్రతి బడ్జెట్ సమావేశాల్లో సామాన్య, మధ్యతరగతి, సంక్షేమానికి, రైతాంగానికి పెద్ద పీఠ వేసేలా బడ్జెట్ రూపకల్పన చేసి సంక్షేమానికి విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే ఎస్సీ సంక్షేమం, విద్య, వైద్య రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం, దళిత బంధు, మన ఊరు మన బడి కార్యక్రమాలతో పాటు ప్రతీ జిల్లాకు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో తెలంగాణ... ఆరోగ్య తెలంగాణగా విరాజిల్లుతుంది. మరోవైపు రైతాంగానికి ఏ రాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్ సర్కార్ మొదటి నుంచి కృషి చేస్తోంది. రైతుకు కావాల్సిన కరెంటు, నీటి సౌకర్యం, పెట్టుబడి సాయం చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ధాన్య భాండాగారంగా విరసిల్లుతుంది. అలాగే నియామకాల విషయంలో లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తూ అనేక అవకాశాలు కల్పించింది. వీటన్నింటిని ఉటంకిస్తూ గవర్నర్ అసెంబ్లీ సమావేశాల్లో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అంటూ వివరించారు. తెలంగాణను దేశానికి రోల్‌మోడల్‌గా ఉంచిన కేసీఆర్ భారత రాజకీయాల్లోనూ బలమైన శక్తిగా నిలవాలి.
సంపత్ గడ్డం
7893303516