కవితకి మద్దతివ్వడం నేరమే!

by Ravi |   ( Updated:2023-03-16 03:06:24.0  )
కవితకి మద్దతివ్వడం నేరమే!
X

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన అభిమానులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తల మద్దతు పొందడం, జై కొట్టించుకోవడం చూస్తుంటే విడ్డూరంగా అనిపిస్తుంది. సీఎం కూతురు కాకుండా కవిత వేరే పార్టీ మహిళ అయ్యుంటే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ విధంగా ప్రవర్తించి ఉండే వాళ్ళు కాదేమో. నిజానికి కవిత ఒక మహిళ అయ్యుండి ఈ స్కాంలో పాత్రదారి కాకుండా ఉండాల్సింది కాదు. చేసినా అది చట్టరీత్యా నేరం కూడా అవుతుంది. తప్పు చేసింది తన కూతురైనా, కొడుకైనా క్షమించేది లేదని చాలా సందర్భాల్లో కేసీఆర్ వ్యాఖ్యానించారు మరి ఇప్పుడు తన కూతురుని ఎందుకు వెనకేసుకొస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ మహిళలకు తాను ఆత్మగౌరవంగా చెప్పుకునే కవిత ఒక సీఎం కూతురిగా మధ్యనిషేధం వైపుగా ఎందుకు అడుగులు వేయలేదు. వేల సంఖ్యలో ఉన్న బెల్ట్ షాపులు ఎందుకు అరికట్టలేదు? రాష్ట్రంలో మద్యం మైకంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు, నేరాలు కవితకి తెలియదా..? లేక తన మద్యం వ్యాపారం మూడు పూలు, ఆరు కాయలుగా వర్ధిల్లడానికే రాష్ట్రంలో గుడుంబాని నియంత్రించి, బెల్ట్ షాపుల్ని ప్రోత్సహించిందా..?

తాజాగా సోమవారం రోజు కవిత బర్త్‌డే వేడుకల్ని కూడా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరింత ఘనంగా నిర్వహించడం చూస్తుంటే, ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో కూడా అర్థం కావడం లేదు. కవిత జైలుకు వెళ్తుందని తెలిసి కూడా, ఆమెకు అండగా నిలబడటం, ఆమె పనులకు బహిరంగంగా మద్దతు పలకడం అంటే ఆమె చేసిన అవినీతికి కూడా బహిరంగంగా మద్దతు ఇస్తున్నట్టే కదా!

కానీ ఇలాంటి ధోరణి సరైనది కాదని కవిత అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పు చేస్తే ఎవరైన శిక్ష అనుభవించాల్సిందే అప్పుడే మంచి నాయకులు వచ్చి మెరుగైన సమాజం తయారవుతుంది. కేవలం వ్యక్తిగత మెప్పుకోసం, వారు చేసే అవినీతిని, నేరాల్ని ప్రోత్సహించడం కూడా నేరం క్రిందికి వస్తుందన్న విషయాన్ని నేడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

పసునూరి శ్రీనివాస్

88018 00222

Also Read: నేడు ఈడీ విచారణకు కవిత.. అరెస్టుపై బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్!

Advertisement

Next Story

Most Viewed