- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టులందరికీ.. ఒకే రూల్స్ ఉండవా?
ఖమ్మంలో జర్నలిస్టుల కోసం 23 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కొన్ని రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. అలాగే ఇటీవలే మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్‌లో 155 మంది జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేశారు. ఏప్రిల్‌లో ఆందోల్ నియోజకవర్గంలోని జర్నలిస్టులకు మంత్రి హరీశ్ రావు ఇండ్ల పట్టాలను అందజేశారు. మరో నాలుగైదు మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఇలాగే ఇండ్ల స్థలాలను అందజేశారు. అయితే ఏ ప్రాతిపదికన ఆయా చోట్ల జర్నలిస్టులకు ప్రభుత్వం ఇండ్లస్థలాలు, డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేస్తున్నదో తెలియడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఇలాంటి కార్యక్రమం చేపట్టకుండా, నియోజకవర్గం, మండలాల వారీగా జర్నలిస్టులను విడదీయడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. అసలు స్టేట్ మొత్తం ఒకే రూల్స్ ఎందుకు వర్తింపజేయడం లేదోనని జర్నలిస్టుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముందుకు పడని అడుగు..
ఉద్యమ సమయంలో, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అనేకసార్లు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయినా అడుగు ముందుకు పడకపోగా, సుప్రీంకోర్టులో ఈ కేసు పరిష్కారం కావడంతో ఈ ప్రక్రియ కాస్త స్పీడప్ అయి, ఇండ్ల స్థలాల కేటాయింపు బాధ్యతలను మంత్రి కేటీఆర్‌తో పాటు మీడియా అకాడమీకి అప్పగించారు. దీంతో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టు సంఘాలు, మీడియా సంస్థలతో సంప్రదింపుల ప్రక్రియ మొదలు పెట్టి, అభిప్రాయాలను సేకరించారు. అయితే ఆ తర్వాత కూడా అడుగు ముందుకు పడలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఏమో కానీ.. చివరికి సుప్రీంకోర్టులో కేసు పరిష్కారమైన జవహర్ సొసైటీ సభ్యులకే ఇంకా ఇండ్ల స్థలాలు కేటాయించలేదు. కానీ కొన్ని చోట్ల మాత్రమే వేర్వేరుగా ఇండ్ల స్థలాలు కేటాయించడంలో మతలబేమిటోనని జర్నలిస్టు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే ఈ స్థలాలు మంత్రులు, ఎమ్మెల్యేలు కనికరిస్తేనే అందుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే ఎలాంటి అర్హతలను ప్రభుత్వం ఫిక్స్ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.
వారిని ఊరించడానికేనా?
రాష్ట్రంలో మిగితా చోట్ల స్థలాలు, డబుల్ బెడ్ రూం లు పంపిణీ చేసినట్లుగానే ఖమ్మంలోనూ జర్నలిస్టులకు స్థలాలు పంపిణీ చేసే వీలుంది. కానీ అలా చేయకుండా అలా చేయకుండా 23 ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించింది. అయితే దీని వెనక ఓ మతలబు దాగి ఉన్నదని జర్నలిస్టు సంఘాలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఖమ్మంలో అధికార బీఆర్ఎస్ పార్టీ వీక్‌గా ఉందని, 2014, 2018 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని ఆ పార్టీ గెలుచుకోగలిగింది. కానీ గెలిచిన ఎమ్మేల్యేలు బీఆర్ఎస్‌లో చేరినా.. ఆ జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి ఆగమ్యగోచరంగానే ఉంది. అంతేకాక పొంగులేటిని సస్పెండ్ చేయడం, ఆయన ఉమ్మడి ఖమ్మం నుంచి ఒక్కరు కూడా బీఆర్ఎస్ నుంచి గెలవనివ్వనని సవాల్ చేయడంతో అధికార పార్టీకి భయం పట్టుకున్నదని అందుకోసమే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ అనుకూల పవనాలు వీచేలా జర్నలిస్టులను ఇండ్ల స్థలాల పేరిట ఊరించే ప్రోగ్రామ్ ను క్రియేట్ చేశారని పలువురు జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నాడు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నెల రోజుల్లోపు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కానీ ఎన్నికలయ్యేంత వరకు కేటాయించరని, పార్టీకి అక్కడ మంచి ఫలితాలు వస్తేనే అవి కేటాయిస్తారని, లేకుంటే అవి అందని ద్రాక్షగానే మారుతాయని జర్నలిస్టు సంఘాల నుంచి వినిపిస్తున్న మాట..
అయితే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపులో పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకొని చర్యలు చేపట్టారు. కొందరు సీఎంను ఒప్పించి ఇండ్ల స్థలాలను కేటాయించారు. కానీ ఇలా సింగిల్ డిజిట్ ఎమ్మెల్యేలే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయించడం కోసం ప్రయత్నిస్తుంటే మిగితా చోట్ల ఎమ్మెల్యేలు చేతగాని వారన్నట్టేనా? అందుకే కేసీఆర్ చొరవ తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఒకే రూల్స్ తీసుకొచ్చి, అర్హతలను నిర్ధారించి, పంపిణీ చేయాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఫిరోజ్ ఖాన్,
సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,
96404 66464