- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
World Diabetes Day : డయాబెటిస్ వ్యక్తిగతమేనా?
ఈరోజు Children's Day మాత్రమే కాదు. World Diabetes Day కూడా... Diabetesకి అంచులో నేడు మానవాళి ఉంది. Insulin Resistance మెల్లమెల్లగా పెరుగుతోంది. పెట్టుబడిదారీ వ్యవస్థ మెల్లమెల్లగా మనందరినీ ఈ Type 2 Diabetes పెనం మీద కూర్చో బెడుతుంది. ప్రపంచీకరణ తన లాభాల సంచుల కోసం పనికిరాని consumer goods తీసుకొచ్చింది. ఆకాశాన్ని తలదన్నే షాపింగ్ మాల్స్. రెండు వస్తువులు కొనడానికి వెళ్ళిన కొనుగోలుదారుడు ఇరవై ఆహార పదార్థాల ప్యాకెట్లు బాస్కెట్లో వేసుకుంటాడు. అందులో Ultra processed foods 95 శాతం ఉంటాయి. ఇలా హానికరమైన Ultra processed foods మనకు చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు. మరోవైపు, అభివృద్ధి చెందిన online food delivery apps క్షణాల్లో జంక్ ఫుడ్స్ మన చేతుల్లో పెడతాయి.
నడిచే మనుషులేరీ?
మరోవైపు sedentary lifestyles. నడిచే మనుషులు నేడు కనిపించడం లేదు. ఏదో ఒక వాహనంలోనే కనిపిస్తున్నారు. రాత్రి 10 కి ముందు భోజనం చేసే ప్రజలు తగ్గిపోయారు. వైట్ రైస్ వాడకం పెరిగింది. స్వీట్లు వాడకం పెరిగింది. Insulinను శరీరం వాడలేకపోతోంది. Obesity కూడా పెరిగింది. ప్రతి పదిమందిలో ఆరుగురు overweight అయిపోవడం బాధాకరం. దారుణమైన జీవిత విధానం కార్పొరేట్ వర్గం అలవాటు చేసింది. ఏం కావాలో మనిషికి తెలీదు.ఎందుకు ఈ పరుగు? ఏమో తెలియదు. అందని మాయలేడి అందేసుకోవాలి. అలా పరుగులు పెడుతూ సహజమైన ఆనందాలకు దూరంగా జరిగిన మనిషి. అయినా, మానసిక శాంతి లేదు. మరలా దీన్నుంచి లాభాలు ఏరుకోడానికి health industry diabetes treatment అని వేలకోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది.
వైద్యులకే ఇది స్వర్ణ యుగం
ఆయా వైద్యులకు గోల్డెన్ ఏజ్. Diagnosis యంత్రాలకు పండుగ. మందులమ్మే కార్పొరేట్లకు పెద్ద పండుగ. ఎందుకంటే ఏ మందూ శాశ్వతంగా సుగర్ తగ్గించదు. జీవితాంతం సేవించాల్సిందే. మన భయాలను సొమ్ము చేసుకోవడానికి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ కూడా పక్కనే ఉంది. అయితే ఈ ట్రాప్ నుంచి చాలా జాగ్రత్తగా బయట పడాలి. చాలా కష్టం. కానీ, అసాధ్యం కాదు. Lifestyle లోనూ, తినే ఆహారంలోనూ చాలా జాగ్రత్తగా చాలా మార్పులు చేసుకుంటే తప్ప ఈ diabetes పెనం నుండి బయటికి రాలేం.
వ్యవస్థాగత వ్యాధులకు వ్యక్తులు బలి
ఇదంతా వ్యక్తిగతం మాత్రమే కాదు. వ్యవస్థాగతం కూడా. ఆఫీసుల్లో అటూ ఇటూ కదలలేని క్యాబిన్‌లు ఇచ్చి, పన్నెండేసి గంటలు శిలలా అతుక్కు పోయేలా చెయ్యడం వ్యక్తిగతం ఎలా అవుతుంది? మరలా తీర్చలేని టార్గెట్స్ ఇచ్చి టెన్షన్ ప్రసాదించడం కూడా వ్యక్తిగతమేనా? చదివితే ఉద్యోగాలు రావు. వస్తే అందులో మరలా టార్గెట్స్. లేదా పర్మనెంట్ ఉద్యోగాలు లేవు. ఎప్పుడు ఊడిపోతాయో తెలీని పరిస్థితి. అనుక్షణం సాధారణ పౌరుడు సంఘర్షణలో ఉంటాడు. టెన్షన్ పడకండి, సుగర్ వస్తుంది అని ప్రవచనాలు పలుకుతారు. అసలు, టెన్షన్ అనేది వ్యక్తిగతమేనా? వ్యవస్థాగతం కాదా? మనుషుల జీవితాలు ఇంత దారుణంగా ఎందుకుండాలి? ఆరోగ్యకరమైన జీవితం ఇవ్వడంలో వ్యవస్థలు సఫలీకృతం కానట్టేనా?
- కేశవ్
'జాగృతి సమీక్ష' సంపాదకులు
98313 14213