- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విప్లవ సౌందర్య స్ఫూర్తి!
శ్రమజీవుల చిహ్నమైన కత్తీ, సుత్తీ ..
త్యాగాల పోరాటాల సంకేతమైన ఎర్రజెండాలో
హత్తుకుని పుట్టిన రోజు.... మేడే!
ప్రపంచ చరిత్రలో తొలిసారిగా
శ్రామికుల చిహ్నం జెండాగా
జన్మించిన సుందర దినం మేడే!
సామాజిక బీభత్సాల్ని ధ్వంసం చేసి
జీవన సౌందర్యాలను ఆవిష్కరించడానికి
దీక్ష చేబూనే రోజు -మేడే!!
ఒక మనిషిని మరొక మనిషీ,
ఒక జాతిని వేరొక జాతీ
పీడించే సాంఘిక ధర్మాల అంతానికి,
నూతన యుగారంభానికి
సంకేతంగా నిలిచే రోజు - మేడే!
మానవ జీవితాన్ని సౌందర్యాత్మకం
గావించటానికి గుండె నెత్తురులు తర్పణ చేస్తూ
సాగుతున్న ఆధునిక చరిత్రలో ఎన్నో బీభత్సాలు...
ఆ బీభత్సాల చరమ గీతానికి శ్రామిక
విప్లవాల యుగ శీర్షిక - మేడే!
బీభత్సాల్లో పుట్టిన సౌందర్యం - మేడే!
ప్రకృతి బీభత్సాన్ని తొలగించి
సౌందర్యాన్ని తీర్చిదిద్దేది శ్రమజీవులు!
సామాజిక బీభత్సాన్ని నిర్మూలించి
సుందర సమతా వనాలను నిర్మించేది
ఉద్యమకారులు! వీరులు!! త్యాగధనులు!!!
వారే నిజమైన సౌందర్య రాశులు.
కవులు ఆకాశం నుండి ఊడిపడరు.
వారు మానవ చైతన్య ప్రతీకలు, ప్రతినిధులు.
మానవ సమాజం భూమయితే సాహిత్యం ఊటబావి.
సాహిత్యం నీరయితే, కవిత్వం ఎగిసిపడే కెరటం.
సామాజిక బీభత్సాన్ని నిర్మూలించుకుని ,
జీవితాన్ని మరింత సౌందర్యవంతం గావించుకునే
నిరంతర భావావేశాన్ని కవులు రగిలిస్తారు.
నూతన సౌందర్యాల సృష్టికి పరోక్ష ప్రేరకులౌతారు.
ఈ కర్తవ్య నిర్వహణలోనే
కవితా సౌందర్యం యిమిడి వుంది
మేడే అంటేనే నూతన యుగావిష్కరణకై
అలుపెరుగని ఆశావహమైన ఆర్తి!
అది నిరంతరాయ విప్లవ సౌందర్య స్ఫూర్తి !!
-దివికుమార్
జనసాహితి
94401 67891
- Tags
- Mayday