- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదీ సంగతి:లవ్ ఇన్ పొలిటికల్ ఫండ్
దేశంలో సుమారు 56 కోట్ల మందికి ఉపాధి లేని పరిస్థితి ఉంది. జీవితాన్ని కాపాడే మందులు, నిత్యావసరాలు, సీఎన్‌జీ, పెట్రోల్, డిజిల్ ధరలను పెంచేసారు. 'చెరుకు గడను పిండి రసం తీసినట్లు' మనుషుల కష్టార్జితాన్ని లాగేస్తున్నారు. గత 72 సంవత్సరాలలో ఎన్నడూ లేనిది ఢిల్లీ తీరాన ఉన్న యమునా నది ఎండిపోయింది. అక్కడ భూమి బీటలువారిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. విదర్భలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలో యావరేజ్ ఉష్ణోగ్రత 40 డిగ్రీలుగా నమోదవుతోంది. పొలిటికల్ ఎకనామికల్ క్రైసిస్ కూడా అలాగే ఉంది. ఇంత జరుగుతున్నా పొలిటికల్ ఫండింగ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. 2021 ఏప్రిల్‌లో రూ. 695 కోట్లు, 2019లో రూ. 2,256 కోట్లు పొలిటికల్ ఫండింగ్ జరిగింది. కోటి రూపాయలవి 640 బాండ్లు ఇష్యూ అయ్యాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో రూ.1,214 కోట్ల పొలిటికల్ ఫండింగ్ జరిగింది.
భారతదేశంలో గడచిన ఏడున్నర సంవత్సరాలలో పొలిటికల్ ఫండింగ్ భారీగా పెరిగింది. ఎలక్టోరల్ బాండ్స్ వచ్చిన తర్వాత ఈ ఫండింగ్ భారీగా లభిస్తున్నది. సహజంగానే ఇందులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భాగస్వామ్యమే అధికంగా ఉంది. రాష్ట్రములో టీఆర్ఎస్ నంబర్ వన్‌గా ఉంది. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు పొలిటికల్ ఫండింగ్ లభించకుండా బీజేపీ అడ్డంకులు కలిగించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడున్నర ఏండ్లుగా దేశంలో రూ. 9 లక్షల 836 కోట్ల మేరకు పొలిటికల్ ఫండింగ్ జరిగినట్లు రిపోర్టులు ఉన్నాయి. 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఎకానమీ' ఇచ్చిన నివేదిక ప్రకారం నిరుద్యోగం శాతం 2020 మార్చిలో 7.60 శాతం ఏప్రిల్‌లో 7.83 శాతం ఉంది.
ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూలూ అద్భుతంగా ఉందని లెక్కలు ప్రకటించారు. నిరుద్యోగానికి మించిన విషాదం, దుఃఖం మరొకటి లేదనే విషయాన్ని మాత్రం విస్మరించారు. ఏప్రిల్ నెలలో గ్రామీణ ప్రాంతాలలో 8.28 శాతం నిరుద్యోగం ఉంటే, పట్టణాలలో 9.22 శాతం ఉంది. ఒక్క హర్యానా రాష్ట్రంలోనే 34.5 శాతం నిరుద్యోగం ఉండగా, రాజస్థాన్‌లో 28.8 శాతం ఉంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని నరేంద్రమోడీ హామీ హుష్‌కాకి అయిపోయింది. పని ఉన్నవారికి వేతనం తక్కువగా ఉంది. ఈ ఏడేండ్లలో ఐదు లక్షల కంపెనీలు మూత పడగా, రెండు కోట్ల మంది ఉద్యోగులను తొలగించారు. కోటికి పైగా కుటుంబాలు ఆగమయ్యాయి. బ్యాంకులలో ఎన్‌పీఏ పెరిగింది. 2035 దాకా బ్యాంకుల పరిస్థితి బాగుపడే పరిస్థితి లేదని ఆర్‌బీఐ వర్గాలు చెబుతున్నాయి. ఆర్‌బీఐ రిపోర్ట్ ప్రకారం ఏదైతే విజన్ అమలు చేయాల్సి ఉండెనో, దానిని కేంద్రం అమలు చేయలేకపోయింది.
సంపాదనే ముఖ్యం
కేంద్రం పొలిటికల్ ఎకానమీని అమలు చేసింది. మూడు లక్షల కోట్ల రూపాయలను డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా సంపాదించింది. ప్రతీ విధాన నిర్ణయం వెనుక ఎలక్షన్, అందులో గెలవడానికి కలెక్షన్ అంటే, పొలిటికల్ ఫండింగ్ ముడిపడి ఉంటున్నది. రూ. 60 లక్షల కోట్లు సంపాదించి పెట్టే పీఎస్‌యూలను 6 లక్షల కోట్లకు 2025 లోపు అమ్మి వేసే ప్రక్రియను కొనసాగిస్తున్నది కేంద్రం. విశ్వగురు, మేక్ ఇన్ ఇండియా, అమృత్ కాల్ పేరిట, విద్వేషాల ఉపన్యాసాల ద్వారా మనుషులను మానసికంగా విడదీసి అదే మత్తులో రాజ్యం ఏలాలని అనుకుంటున్నది. ఆర్ఎస్‌ఎస్ ఎజెండాను బీజేపీ అమలు చేస్తున్నది. పొలిటికల్ ఫండింగ్‌కు ఢోకా లేదు. 'నారా దేశ్‌కా లగా-తిజోరీ దోస్త్‌కి భరీ' (నినాదం దేశానిది-బొక్కసం నిండింది మాత్రం మిత్రునిది) అన్నట్టుగా ఉంది పరిస్థితి.
దేశంలోని ప్రభుత్వ శాఖలలో ఖాళీలు 50 లక్షలకు పైగా ఉన్నా కనీసం 10 లక్షలు కూడా భర్తీ చేయలేదు. అడిగేవారు లేరు. ప్రశ్నించే వారిని దేశద్రోహులంటూ జైలులో పెడుతున్నారు. విమర్శలను, నిజాలను భరించే, ఎదురుకునే దమ్ము పాలకులకు లేదు. ప్రభుత్వ రంగ సంస్థల విచ్చలవిడి అమ్మకాలు, పెట్టుబడుల ఉపసంహరణ, బ్యాంకు రుణాల వే ఆఫ్ మూలంగా పారిశ్రామికవేత్తలు, పొలిటికల్ వ్యాపారులు, కార్పొరేట్లు, పొలిటికల్ పార్టీలకు భారీగా ఫండ్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఎన్నికలు ఉన్నా లేకున్నా ఫండింగ్ ఆగలేదు. పరిశ్రమలు మూతపడి కోట్లాది మంది రోడ్డుమీదికి వచ్చారు.
అన్ని ధరలూ పెరిగాయి
దేశంలో సుమారు 56 కోట్ల మందికి ఉపాధి లేని పరిస్థితి ఉంది. జీవితాన్ని కాపాడే మందులు, నిత్యావసరాలు, సీఎన్‌జీ, పెట్రోల్, డిజిల్ ధరలను పెంచేసారు. 'చెరుకు గడను పిండి రసం తీసినట్లు' మనుషుల కష్టార్జితాన్ని లాగేస్తున్నారు. గత 72 సంవత్సరాలలో ఎన్నడూ లేనిది ఢిల్లీ తీరాన ఉన్న యమునా నది ఎండిపోయింది. అక్కడ భూమి బీటలు వారిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. విదర్భలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలో యావరేజ్ ఉష్ణోగ్రత 40 డిగ్రీలుగా నమోదవుతోంది. పొలిటికల్ ఎకానమికల్ క్రైసెస్ కూడా అలాగే ఉంది. ఇంత జరుగుతున్నా పొలిటికల్ ఫండింగ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. 2021 ఏప్రిల్‌లో రూ. 695 కోట్లు, 2019లో రూ. 2,256 కోట్లు పొలిటికల్ ఫండింగ్ జరిగింది. కోటి రూపాయలవి 640 బాండ్లు ఇష్యూ అయ్యాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో రూ.1,214 కోట్ల పొలిటికల్ ఫండింగ్ జరిగింది. ఇక జేబులకు వెళ్లిన దానికి లెక్కే లేదు.
ఇటీవల హెలికాప్టర్ ట్రైనింగ్ ఇచ్చే పవన్ హన్స్ లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ సంస్థ విలువ 511 కోట్ల రూపాయలు ఉంటే నష్టాల పేరిట ఒక ప్రైవేటు కంపనీకి 211 కోట్ల రూపాయలకు అమ్మేసారు. ఇందులో బీజేపీకి భారీగా పొలిటికల్ ఫండింగ్ జరిగిందట. ఇందులో ఓఎన్‌జీసీ వాటా 49 శాతం, ప్రభుత్వ వాటా 51 శాతం ఉంది. ఇదీ ప్రస్తుతం కేంద్రం పరిస్థితి. దేశాన్ని విడిచి వెళ్లిన ధనవంతుల సంఖ్య ఎనిమిది లక్షలు దాటిందట. ఆర్‌బీఐ ఈఎంఐని 6.7 నుంచి 6.95కు పెంచేసింది. దీనితో దేశంలో రుణాలు తీసుకున్న సామాన్యుడి మీద భారం పడుతున్నది. షేర్ బజార్ నుంచి రూ.1,75,790 కోట్లు విదేశీ పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. 11 అతిపెద్ద విదేశీ కంపెనీలు మూతపడ్డాయి. దీంతో లక్షల మంది ఉపాధి కోల్పోయారు. 180 దేశాలలో 'ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్'లో మనదేశం 150 వ స్థానానికి పడిపోయింది. న్యాయం కోసం పోరాడిన సిద్ధిక్ కప్పన్ అనే జర్నలిస్ట్ 19 నెలలుగా జైలులోనే మగ్గుతున్నాడు. ఇలాంటివారి పట్ల శ్రద్దే లేని పొలిటికల్ లీడర్లు, పార్టీలు మాత్రం పొలిటికల్ ఫండ్‌ను పోగు చేయడంలో మునిగిపోయారు.
ఎండీ మునీర్
జర్నలిస్ట్, కాలమిస్ట్
99518 65223