- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్సీ వర్గీకరణ రెండు కులాల మధ్య ఘర్షణకేనా?
ఎస్సీ కులాల్లో సామాజిక సమానత్వం కోసం అమలుపరిచిన ఉప వర్గీకరణ రాజ్యాంగ విరుద్దమని మాల సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2000 నుంచి అమల్లో ఉన్న ఎస్సీ ఉప వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అదే E.V చెన్నయ్య VS యూనియన్ ఆఫ్ ఇండియా-2004 కేసుగా చెబుతాం. దీంతో మాదిగ ఉప కులాలు నిరసన వ్యక్తం చేసి, వర్గీకరణ చట్టబద్ధతకై కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు.
ఈ నేపథ్యంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం2007లో ఉషా మెహ్రా కమిషన్‌ను నియమించినది. ఈ కమి షన్ కూడా రిజర్వేషన్ల వర్గీకరణ అవసరమని చెప్పింది. కానీ ప్రభుత్వాలు ఓట్ల రాజకీయం కోసం ఇన్నాళ్లు దాటవేశారు. ఇటీవల స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ అదర్స్ vs దేవీందర్‌సింగ్ కేసులో గతం లోని తీర్పును పునఃసమీక్షించి 2024 ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. ఈతీర్పుతో 20ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.
తీర్పుతో మొదలైన అలజడి
సుప్రీంకోర్టు తీర్పులో ఎస్సీ కులాల్లో ఎక్కువ, తక్కువలున్నాయని చెప్పింది. సామాజిక, ఆర్థిక స్థితిగతులు గణాంకాలు సేకరించి, వాటి ఆధా రంగా ఉప వర్గీకరణ చేయాలనీ స్పష్టం చేసింది. ఈ తీర్పు అనంతరం మాలల్లో అలజడి మొద లైంది. మాల, మాదిగల మధ్య విమర్శలు కూడా తీవ్రస్థాయికి చేరాయి. దీంతో ఈ రెండు కులాల మధ్య వైశమ్యాలు మరింత పెరిగిపోతున్నాయి. రాజకీయ చైతన్యం కలిగి, రాజకీయాలను ప్రభా వితం చేయగలిగే స్థాయిలో ఉన్న ఈ కులాలు విమర్శలు చేసుకోవడం ప్రమాదకరం. దీంతో మన చైతన్యం, మన విముక్తి పోరాటం నీరుగారిపోతుంది. ఈ అసంఘటితత్వం వలన బహుజన రాజ్యాధికార కల నెరవేరదు. మరోవైపు దళిత సామాజిక న్యాయానికి కృషి చేయాల్సిన ఈ వర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు సమస్యను మరింత జటిలం చేయడం బాధాకరం. ఈ సమస్య త్వరగా పరిష్కారం కాకపోతే అగ్రవర్ణ రాజకీయ పార్టీలకే లాభం జరుగుతుంది.
ఎస్సీల మధ్య వైరుధ్యం అందుకే..
భారతదేశంలోఅనాదిగా షెడ్యూల్ కులాలను అట్టడుగు స్థాయిలో ఉంచారు. వీరంతా వేల సంవత్సరాల నుంచి సామాజిక హక్కులు నిరాకరించబడి అస్పృశ్యత, అంటరానితనాన్ని అనుభవించారు. వీరి ఉన్నతికై డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగంలో 15శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇందులో 59ఉపకులాలు ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానంగా ఉన్న కులాలు మాదిగ, మాలలు. వీరిలో జనాభా పరంగా అత్యధికంగా ఉండి, వెనబడ్డ కులం మా దిగ వర్గం. తెలంగాణ రాష్ట్రంలో మాలలతో పో లిస్తే మాదిగ జనాభా అధికం. కానీ వీరు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో వెనుకబడ్డారు. ఈ విష యాన్నీ పలు కమిషన్‌లు కూడా చెప్పాయి. వీరి మధ్య అసమానతల నేపథ్యంలో మాల, మాది గల మధ్య వైరుధ్యం పెరిగింది. మందకృష్ణ మాదిగతో పాటు మాదిగ మేధావుల నేతృత్వంలో 19 94న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో..
దీని ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమం మొదలైంది. దీంతో ఆనాటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు 1996 లో వర్గీకరణ అంశంపై జస్టిస్ పి.రామచంద్రమూర్తి కమి షన్ నియమించారు. ఈ కమిషన్ షెడ్యూల్డ్ కు లాల్ని వెనకబాటుతనం ఆధారంగా ఏ, బి, సి, డి లుగా వర్గీకరణ చేయాలనీ సిఫార్సు చేసింది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను విద్యా, ఉద్యోగాల్లో వర్తింప చేయాలని సూచించింది. ఈ కమిషన్ నివేదిక మేరకు 2000 నుంచి ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ అమలు పరిచారు. ఇందులో బి-వర్గంలో ఉన్న మాదిగలకు 7 శాతం, సీ-వర్గంలో ఉన్న మాల లకు 6 శాతం మరియు ఇతర ఉపకులాలకు మిగతా శాతాన్ని వర్తింపజేశారు. దీంతో కొంత వరకు మాదిగలకు విద్య, ఉద్యోగాల్లో లబ్ధి జరిగింది.
వర్గీకరణతోనే సామాజిక న్యాయం!
వాస్తవంగా మాలలు ఎక్కువగా ఆంధ్రాలో ఉన్నా రు. చారిత్రకంగా బ్రిటిష్ పరిపాలనలో ఉన్న ఆంధ్రాలో వీరు విద్య, ఉద్యోగ అవకాశాలను అందిపుచుకున్నారు. నైజాం పరిపాలనలో ఉన్న మాదిగలు మాత్రం చర్మకార వృత్తికే పరిమితమై వెనకబడ్డారు. ఇప్పటికి వీరు గ్రామాల్లో పారిశుద్ధ్య వృత్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మాదిగలు కన్నా తక్కువ ఉన్న మాలల రిజర్వేషన్ లలో మెజార్టీ వాటాను కోరుకోవడం ఎంతవరకు సబబు? సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలం గాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం అసెంబ్లీలో ప్రస్తుత నోటిఫికేషన్లలో వర్గీకరణను అమలు చేస్తామనీ ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీ ర్పును అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభు త్వం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. ఈకమిటీ వర్గీకరణ కోసం ఏక సభ్య కమిషన్‌ను నియమించాలని సూచించింది.
ఈ వర్గీకరణ నిష్పక్షపాతంగా జరగాలి!
ఈ మేరకు ఇటీవల తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై సమగ్ర అధ్యయనం చేసేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఇదీ 60 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని గడుపు విధించారు. అనంతరమే విద్య , ఉద్యోగాలలో ఎస్సీ ఉప వర్గీకరణ అమలు కానుంది. ఇప్పటికే ఈ కమిషన్ పని ప్రారంభించింది. చారిత్రకంగా కొన్ని వేల సంవత్సరాల నుంచీ అణిచివేయబడిన జాతిగా మాదిగ సమా జం సామాజిక వివక్షతను అనుభవిస్తుంది. అణిచి వేయబడిన వర్గాన్ని ఆధిపత్యం వర్గంతో సమా నం చేయడానికే కదా రిజర్వేషన్లను అంబేద్కర్ కల్పించాడు. ఈ క్రమంలో రిజర్వేషన్ ఫలాల్లో కూడా అసమాన పంపిణీ జరగడం వలన మరింత నష్టం జరుగుతుంది. కావున ఎస్సీలో జనాభా ప్రాతిపదికన ఉప వర్గీకరణ చేయాల్సిన అవసరం ఇప్పుడుంది. ఇది నిష్పక్షపాతంగా జరగాలి.
సంపతి రమేష్ మహారాజ్
సామాజిక విశ్లేషకులు
99595 56367