- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఉత్తరాంధ్రకు మహర్దశ!

తూర్పు తీరంలో ప్రగతి కిరణ కాంతులు విస్తరిస్తున్న సందర్భం యావత్ ఆంధ్రావనికి ఇది నవనవోన్మేష సమయం. పారిశ్రామిక, మౌలిక వసతుల రంగాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించేలా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. మొత్తం ప్రాజె క్టుల విలువ రూ.1,99,786 కోట్లు కాగా, వీటిలో రూ.1,87,885 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉత్తరాంధ్రకు చెందినవే కావడం విశేషం. మోడీ పర్యటనతో ఉత్తరాంధ్రకు మహర్దశ పడుతోందని చెప్పవచ్చు. దేశ తూర్పు తీరానికి ప్రగతిహారాల్లా భాసిల్లే భారీ ప్రాజెక్టు లు రూపుదిద్దుకోబోతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఊరి స్తున్న విశాఖ రైల్వే జోన్ సహా పలు కీలక పరిశ్రమ పారిశ్రామిక రంగానికి ఊపిరులూదేలా, ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే పలు ప్రాజెక్టులు అంకురార్పణ జరగడం శుభ పరిణామమే.
ప్రాజెక్టుల స్వరూపం..
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సమీపంలోని పూడిమడకలో అత్యాధునిక ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్ట్‌కు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ఇది మొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్. ఈ ప్రాజెక్టు దాదాపు 1,85,000 కోట్ల రూపాయల పెట్టుబడి. ఇది 20 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కలిగి ఉంది. ఇది 1500 TPD గ్రీన్ హైడ్రోజన్, 7500 TPD గ్రీన్ హైడ్రోజన్ ఉత్పన్నాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో భారతదేశ అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాలలో ఒకటిగా ఉంది, ఇందులో గ్రీన్ మిథనాల్, గ్రీన్ యూరియా, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్, ఎగుమతి మార్కెట్‌ను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంది. 2030 నాటికి భారతదేశ నాన్-ఫాసిల్ ఎనర్జీ కెపాసిటీ లక్ష్యమైన 500 GW సాధించడంలో ఈ ప్రాజెక్ట్ గణనీయంగా దోహదపడుతుంది. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్‌కు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్ (VCIC), విశాఖపట్నం-కాకినాడ పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్ ఇన్వె స్ట్‌మెంట్ రీజియన్‌లకు సమీపంలో ఉన్నందున ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంలో సహాయపడుతూ వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియా (KRIS సిటీ)కి కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్ అయిన కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియా (KRIS సిటీ), గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా ఊహించబడింది. ఈ ప్రాజెక్ట్ సుమారు రూ. 10,500 కోట్ల గణనీయమైన ఉత్పాదక పెట్టుబడులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. దాదాపు 1 లక్ష ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించే విధంగా అంచనా వేయబడింది, జీవనోపాధిని గణనీయంగా పెంచుతుంది. ప్రాంతీయ పురోగతిని నడిపిస్తుంది.
ఎన్నాళ్ళో వేచిన సమయం
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ (దక్షిణ కోస్తా) ఏర్పాటు చేయాల్సి ఉంది. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలే అధికారంలో ఉండటంతో ఆరు నెలల్లోనే జోన్ కల సాకారం అవుతోంది. పరిశ్రమల హబ్ క్రిస్ సిటీ చెన్నై- బెంగళూరు పారిశ్రామిక నడవాలో భాగంగా తిరుపతి జిల్లాలో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ (క్రిస్టిసిటీ)కి. దీన్ని 2027 ఫిబ్రవరి కల్లా సాకారం చేయాలన్నది ప్రణాళిక. దీనికోసం చిల్లకూరు మండలంలోని పలు గ్రామాల్లో భూసేకరణ చేపట్టారు. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆటో, ఫార్మాసూటికల్స్ తదితర పరిశ్రమలు రానున్నాయి. తొలి దశ లోనే సుమారు రూ.37,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4.67 లక్షల మందికి ఉపాధి. లభించనుందని అంచనా. వాణిజ్యం, సము ద్ర కార్యకలాపాలను మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై దృష్టి సారించి, బ్లూ ఎకానమీ ప్రాముఖ్యతతో ప్రధాన ఆర్థిక శక్తిగా ఎదగాలనే రాష్ట్ర లక్ష్యానికి ఈ పర్యటనలో ప్రధాని మద్దతి చ్చారు. ఆంధ్ర ప్రజల సేవే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పం. ఆంధ్రప్రదేశ్ అవకాశాల రాష్ట్రం. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యం నవయుగ పట్టణీకరణకు ఉదాహరణగా మార్చాలన్నది డబుల్ ఇంజన్ సర్కార్ ముందున్న ధ్యేయం.
వి.సుధాకర్
99898 55445