- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
దిశ, క్రైమ్ బ్యూరో: అగ్రిగోల్డ్ స్కాం కేసులో ఈడీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్‌కు చెందిన రూ.4,109 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది. అంతేగాక, విజయవాడ – గుంటూరు మధ్యనున్న 56ఎకరాల హాయ్ లాండ్ ఆస్తులు, వివిధ కంపెనీలలోని వాటాలు, యంత్రాలను అటాచ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిపాజిట్ దారులకు సొమ్ము చెల్లించకుండా అగ్రిగోల్డ్ యాజమాన్యం రూ.6,400 కోట్ల మనీ ల్యాండరింగ్ స్కామ్‌కు పాల్పడినట్టు ఈడీ తేల్చింది. దీంతో చైర్మన్ అవ్వా వెంకట రామారావు, డైరెక్టర్లు ఏవీ శేషు నారాయణరావు, హేమ సుందర వరప్రసాద్‌ను ఈడీ అరెస్టు చేసి రిమాండ్ చేసింది. ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు రిమాండ్‌లో ఉన్న చైర్మన్, డైరెక్టర్లను కస్టడీకి అనుమతించాలని ఈడీ కోరగా, 10 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈనెల 27 నుంచి జనవరి 5వరకు ప్రశ్నించనున్నారు.