ఢిల్లీలో బీజేపీకి ఈసీ సపోర్టున్నట్టేనా?

by Shamantha N |
EC
X

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎన్నికల కమిషన్ సపోర్టు ఉన్నట్టేనా? అన్న చర్చ దేశవ్యాప్తంగా ఊపందుకుంది. ఓటింగ్ పూర్తయిన తరువాత కేంద్ర హోం మంత్రి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వస్తాయని ప్రకటించడానికి తోడు ఆ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఢిల్లీలో తమ పార్టీకి 40 నుంచి 50 సీట్లోస్తాయని ప్రకటించడం వెనుక ఎన్నికల కమిషన్ ఉందా? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇంతకీ ఈ ఊహాగానాలకు బీజం ఎలా పడిందంటే.. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు ముగిసిన కాసేపటికే ఎంత ఓటింగ్ శాతం జరిగింది?, ఎన్ని ఓట్లు పోలయ్యాయి? అందులో ఎంత పురుషులు? ఎంత మంది స్త్రీలు? వంటి పూర్తి వివరాలతో ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ పెడుతుంది. 5 గంటలకు ఎంత శాతం ఓటింగ్ జరిగింది? ఇంకా ఎంత మంది ఓట్లేసే అవకాశం ఉంది? వంటి పూర్తి వివరాలు 5 గంటలకు వివరించాల్సి ఉంటుంది. అయితే ఇవేవీ జరగలేదు. ఎన్నికలు ముగిసిన 24 గంటల తరువాత.. అది కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ వీడియోలు పెట్టిన తరువాత ఎన్నికల కమిషన్ మీడియా ముందుకు వచ్చింది.

మీడియా ముందుకు వచ్చిన ఈసీ చిత్రమైన వాదన వినిపించింది. ఎంతమంది ఓటింగ్‌కు వచ్చారో తేల్చేందుకు ఇంత సమయం పట్టిందని చెప్పింది. దీంతో అంతా అవాక్కయ్యారు. ఆ లెక్కలు తేల్చడానికి 24 గంటల సమయం పడితే.. మరి ఓటింగ్ సమయంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మీడియా సంస్థలు ఓటింగ్ శాతాన్ని ఎలా ప్రసారం చేశాయి?.. ఎన్నికల సంఘం చెప్పకుండానే మీడియా సంస్థలు ఎన్నికల శాతంపై సమాచారం ప్రసారం చేశాయా? అన్న అనుమానం రేగుతోంది. కేజ్రీవాల్ ట్వీట్‌తో సర్దుకున్న ఎన్నికల సంఘం మీడియా ముందుకు వచ్చి…

ఢిల్లీలో 62.59 శాతం ఓట్లు పోలయ్యాయని తెలిపింది. గత లోక్ సభ ఎన్నికల కంటే ఇది రెండు శాతం ఎక్కువని ఈసీ వెల్లడించింది. బల్లీ మారాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో 71.6 శాతం ఓట్లు పోలవ్వగా, ఢిల్లీ కంటోన్మెంట్‌లో అత్యల్పంగా 45.4 శాతం ఓట్లు పోలయ్యాయని తెలిపారు. అయితే 2015 కంటే నాలుగు శాతం తక్కువ ఓటింగ్ జరిగిందని ఈసీ ప్రకటించింది. ఈసీ ప్రకటనతో ఓటింగ్ శాతమెంతన్నది తెలిసినప్పటికీ… ఈవీఎం టాంపరింగ్‌ప్ ఆప్ అనుమానాలు మాత్రం తీరలేదు.. ఇంతకీ ఢిల్లీ అధికారం బీజేపీదా? ఆప్‌దా? అన్న చర్చ మాత్రం ఉత్కంఠ రేపుతోంది.

Advertisement

Next Story

Most Viewed