భూమా అఖిలప్రియ కుటుంబానికి మరో షాక్..

by srinivas |
Akhila Priya
X

దిశ, క్రైమ్ బ్యూరో: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ కుటుంబం, ఆమె భర్త భార్గవ్ కుటుంబానికి సికింద్రాబాద్ కోర్టు షాక్ ఇచ్చింది. కిడ్నాప్ కేసులో నిందితులుగా ఉన్న ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్‌లను సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించింది. కిడ్నాప్ కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియ ఇప్పటికే అరెస్టు అయ్యి, బెయిల్ పొందిన విషయం తెలిసిందే. ఇంకా ఈ కేసులో అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిలతో పాటు అఖిల ప్రియ అత్తా, మామలను పోలీసులు అరెస్టు చేయలేదు. అయితే, వీరు ఓ వైపు పరారీలో ఉంటూనే.. మరో వైపు ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే తిరస్కరించగా.. తాజాగా అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డితో పాటు భార్గవ్ రామ్ తల్లిదండ్రుల అమ్మానాన్నల ముందస్తు బెయిల్ పిటిషన్‌లను కోర్టు శనివారం తిరస్కరించింది. అయితే, వీరి ముందస్తు బెయిల్ పిటీషన్ తిరస్కరించడంతో ఇక తప్పనిసరిగా అరెస్టు కావాల్సి వస్తోంది.

Advertisement

Next Story

Most Viewed