- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్మల్‌లో వడగళ్ల వాన.. తడిసిన ధాన్యం
by Aamani |
X
దిశ, ఆదిలాబాద్: నిర్మల్‌లో.. వర్షాలు, ఈదురుగాలులు రైతులను అతలాకుతలం చేశాయి. ఆదివారం ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల వడగళ్ల వాన కురవగా.. మరికొన్ని చోట్ల ఈదురుగాలులు వీచాయి. ఫలితంగా కల్లాల్లో అమ్మకానికి ఉంచిన మక్కలు, వడ్లు తడిసిపోయాయి. ఈదురుగాలులతో మామిడికాయలు నేలరాలాయి. జిల్లాలోని ముధోల్, భైంసా, బాసర, తానూర్ మండలాల్లో వడగళ్ల వర్షాలు కురిశాయి. వడగళ్ల కారణంగా ముఖ్యంగా ముధోల్ ప్రాంతంలో మక్క పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మక్కలు నింపిన సంచులు తడిసిపోయాయి. ధాన్యంపై కప్పిన టార్పాలిన్ కవర్లూ నాశనమయ్యాయి. కాగా, సారంగపూర్, దిలావర్‌పూర్, నిర్మల్ లక్షణ చందా, మామడ మండలాల్లో భారీ ఈదురుగాలులు వీచాయి. ఈ గాలులతో మామిడికాయలు రాలిపోయాయి.
Advertisement
Next Story