మొదలైన ‘దృశ్యం 2’

by Shyam |
మొదలైన ‘దృశ్యం 2’
X

దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా లాక్‌డౌన్ వీడి.. సెలెబ్రిటీలంతా మళ్లీ సినిమా షూటింగ్‌లతో బిజీగా మారుతున్నారు. ఎప్పుడో పట్టాలెక్కాల్సిన సినిమాలకు తాజాగా షూటింగ్ ముహుర్తాలు ఫిక్స్ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే.. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ మళ్లీ మేకప్ వేసుకునే టైమ్ వచ్చేసింది. తాజాగా ఆయన కొత్త చిత్రం ‘దృశ్యం 2’ రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్.. ఎట్టకేలకు ఈ రోజు పూజా కార్య‌క్ర‌మాలు ముగించుకొని మొదలైంది.

మోహన్‌లాల్‌ కథానాయకుడిగా 2013లో రూపొందిన మలయాళ చిత్రం ‘దృశ్యం’. ఇందులో ఓ మధ్యతరగతి తండ్రిగా నటించిన మోహనలాల్.. తన కుటుంబానికి ఎదురైన సమస్యను.. ఎలా తెలివితో ఎదుర్కొన్నాడనేది చిత్ర కథ. చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. సూపర్ డూపర్ విజయాన్ని సొంతం చేసుకుంది. మోహన్ లాల్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ తదితర భాషల్లోనూ ఈ సినిమాను రీమేక్ చేశారు. అంతేకాదు చైనీస్ భాషలోకి రీమేక్ అయిన తొలి భారతీయ సినిమాగా కూడా నిలిచింది. కాగా, ఈ సినిమా రీమేక్ అయిన అన్ని భాషల్లోనూ సక్సెస్‌ సాధించడం విశేషం. ఇప్పుడు దర్శకుడు జీతూ జోసెఫ్‌.. దృశ్యం సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాను ఆంటోనీ పెరంబవూర్‌ నిర్మించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed