- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ మార్చి 31 వరకు పొడిగింపు
by Shyam |

X
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోసారి డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇతర వాహన సంబంధ పత్రాల వ్యాలిడిటీని పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఇవి చెల్లుబాటు అవుతాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ ఆదేశాలు పేర్కొన్నాయి. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రజలు గుమిగూడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత ఎక్స్‌పైర్ అయిన వాహన సంబంధ డాక్యుమెంట్లు, పర్మిట్లు, లైసెన్సులు మార్చి 31వ తేదీ వరకు చెల్లుబాటు అవుతాయని వివరించాయి. ఈ వెసులుబాటుతో భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రయాణాలు చేసుకోవడానికి ప్రజలకు అవకాశం ఏర్పడుతుందని కేంద్రం పేర్కొంది. మార్చి 30, జూన్ 9, ఆగస్టు 24వ తేదీల్లో ఈ డాక్యుమెంట్ల వ్యాలిడిటీని పొడిగిస్తూ ఆదేశాలు వెలువరించిన సంగతి తెలిసిందే.
Next Story