- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి
by Shyam |

X
దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని తాండూరు మండల కేంద్రం బతుకమ్మ కుంటలోవరిలో బుధవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకివెళితే.. ట్రాక్టర్ కేజీవీల్స్ తిరగబడి బొమ్మేలి రాజు (28) అనే డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అంతముందు పొలం నారుమడి దున్నుతున్న మరో కేజీవీల్స్ బురదలో కూరుకుపోయింది. దానిని బయటకు తీస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న తాండూరు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. స్థానికుల వివరాల మేరకు కేసు నమోదు చేసుకుని పంచనామా నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
Next Story