- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీలో మందుబాబుల కష్టాలు

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందుబాబులకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఇప్పటికే సరైన బ్రాండ్లు లేక..ధరలు విపరీతంగా మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే లిక్కర్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో కొత్త సమస్య వచ్చి పడింది. మద్యం దుకాణాల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల వల్లే ఈ పరిస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది.
అయితే అభ్యర్థులు.. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎక్కడికక్కడ లిక్కర్ స్టాక్ దించుతున్నారు. గుట్టుగా మందు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో దుకాణాల వద్ద కొనుగోలు చేసే సాధారణ మందుబాబులకు మద్యం దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని వైన్‌షాపుల్లో అంతంత మాత్రం స్టాక్ మాత్రమే ఉండడంతో.. ఒక్కొక్కరికి ఒక్క బాటిల్ మాత్రమే అమ్ముతున్నారని తెలుస్తోంది. మెుత్తానికి వరసగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తాగుబోతులకు ఎక్కడా లేని కష్టాలు వచ్చి పడ్డాయి. మున్సిపల్ ఎన్నికల అనంతరం జెడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మరిన్ని కష్టాలు తప్పేలా లేవు.