- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి పేదకుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు
X
దిశ, నల్లగొండ: ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇస్తామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సంకల్పం మేరకే ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలోని ప్రతి అంశాన్ని విధిగా అమలు పరిచేందుకు అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద రూ.5.8 కోట్ల వ్యయంతో నిర్మించిన 80 డబుల్ బెడ్రూం ఇళ్లను ఆయన గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణ నాణ్యతలో రాజీ పడలేదని, అదే సమయంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా పరిషత్ చైర్మన్ దీపికా, వైస్ చైర్మన్ గోపాగాని, ఎంపీపీ కుమారి, జడ్పీటీసీ సంజీవ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story