‘‘మహిళలను కించపరిచే పాత్రలు చేయను’’…

by Shyam |
‘‘మహిళలను కించపరిచే పాత్రలు చేయను’’…
X

సినిమా అంటే ఆనందాన్ని నింపి, ఉత్సాహాన్ని పెంచి రెండున్నర గంటలపాటు బాహ్యప్రపంచాన్ని మరిచి సంతోషంగా ఉండాలి కానీ ఏడిపించకూడదని, ముఖ్యంగా మహిళలను కించపరిచే పాత్రలు చేయ మిల్కీబ్యూటీ తమన్నా అన్నారు. తాను ఏడిపించే చిత్రాలను చూడనని, అలాంటి చిత్రాల్లో నటించడానికి కూడా ఇష్టం ఉండదని చెప్పింది. అలాంటి చిత్రాలు చూస్తే తనలో వ్యతిరేక భావం చేరుతుందన్న భయం కలుగుతుందని తమన్నా అంటోంది. ఆమె ఒక ఇంటర్వ్యూలో మట్లాడుతూ… సినిమాలో దశాబ్దన్నర అనుభవం ఈ మిల్కీబ్యూటీది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో దాదాపు అన్ని రకాల పాత్రల్లోనూ నటించింది. రొమాంటిక్ పాత్రలు చేసింది, ఆవేశభరిత పాత్రలూ చేసింది. ఆమె చేయని పాత్రంటూ లేదు. అయినా ఇంకా సినిమాలో తాను చేయాల్సింది కూడా చాలా ఉందనే చెబుతోంది. ముఖ్యంగా నృత్యభరిత కథా పాత్రలో నటించాలని, అంత వరకూ నటిగా తన పయనం విరామం లేకుండా కొనసాగుతూనే ఉంటుందని చెప్పింది.

అదే విధంగా అందాలను కాపాడుకోవడంలో చాలా జాగ్రత్త వహిస్తున్న తమన్నా నిత్యం కసరత్తులను చేయడంలో మాత్రం బద్దకించిందని సమాచారం. నటిగా గత ఏడాది కూడా నాలుగు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి ఈ మధ్య అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఒకటి, టాలీవుడ్‌లో సిటీమార్‌ అనే చిత్రం మాత్రమే చేతిలో ఉన్నాయి. ఇక చాలా కాలం క్రితం నటించిన దటీజ్‌ మహాలక్ష్మీ చిత్రం ఇంకా విడుదలకు నోసుకోలేదు. దక్షిణాదిలో అవకాశాల కోసం వెయిటింగ్‌ అంటోన్న తమన్నా..

Advertisement

Next Story