అప్పుల పాలు కావొద్దు.. సదా మీ సేవలో ‘ఎంజీఎం’ : ఎర్రబెల్లి

by vinod kumar |   ( Updated:2021-04-29 05:51:31.0  )
అప్పుల పాలు కావొద్దు.. సదా మీ సేవలో ‘ఎంజీఎం’ : ఎర్రబెల్లి
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా విజృంభిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు వరంగల్‌లోనూ కేసుల తీవ్రత పెరిగింది. ఇటు గాంధీ ఆస్పత్రి, అటు వరంగల్ ఎంజీఎంలో కొవిడ్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మరణాల సంఖ్య కూడా రెట్టింపు అయ్యింది. ఈ నేపథ్యంలోనే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గురువారం ఎంజీఎం వైద్యులతో కలిసి ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై పూర్తి కొవిడ్ ఆస్పత్రిగా ఎంజీఎంను మార్చినట్లు తెలిపారు.

రేపటి నుంచి పీఎంఎస్ఎస్‌వైలో సాధారణ వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. 50 బెడ్స్‌తో రేపటి నుంచి పీఎంఎస్ఎస్‌వైలో నాన్ కొవిడ్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. కొవిడ్ రోగులు ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలు కావొద్దని మంత్రి సూచించారు. ఎంజీఎంలో మరో 250 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఎంజీఎంలో ఆక్సిజన్ కొరత లేదని, ఆందోళన వద్దన్నారు. కేంద్రం సహకరించకపోయినా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని చెప్పారు. వ్యాక్సిన్లు, ఇంజెక్షన్ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed