- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీఆర్ఎస్‌లో నాలుగు స్తంభాలాట!
దిశ, తెలంగాణ బ్యూరో : అధికార పార్టీలో ఉప నాగార్జునసాగర్ ఎన్నిక అటెన్షన్ మొదలైంది. మండలి ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీదున్న గులాబీ దశం సాగర్‌లో ఎలాగైనా పాగావేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ ఇవ్వాళ లేదా రేపు మరోసారి సమావేశం కానున్నారు. ఈ ఉప ఎన్నికల్లో ఎవరిని పోటీకి దింపాలనే అంశంపై అభిప్రాయం తీసుకోనున్నారు. మరోవైపు సాగర్ టికెట్ కోసం సీనియర్లు ఫైట్ చేస్తున్నారు.
ఏడుగురు మంత్రులు అక్కడే
ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఏడుగురు మంత్రులను అక్కడే మకాం వేయించేందుకు గులాబీ బాస్ వ్యూహం వేస్తున్నట్లు పార్టీ నేతలు చెప్పుతున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటుగా జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్‌ను అక్కడే మోహరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రతి మండలానికీ ఎమ్మెల్యేలను నియమించిన సీఎం.. ఇప్పుడు మంత్రులకు టార్గెట్ పెడుతున్నట్టు సమాచారం.
టికెట్ కోసం..?
ఇక సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిని దీటుగా ఎదుర్కొనే వ్యక్తి టీఆర్ఎస్ వేట మొదలుపెట్టింది. యాదవ, రెడ్డి కులంలో టికెట్ ఇవ్వాలో సీఎం కేసీఆర్ నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఈ సెగ్మెంట్లో యాదవ కులం ఓట్లు దాదాపు 55 వేలు ఉన్నాయి. కానీ సెగ్మెంట్ లో రెడ్డి లీడర్లు బలంగా ఉన్నారు. దీంతో ఏ కులం వాళ్లకు టికెట్ ఇస్తే బాగుంటుదని నిఘా వర్గాల నుంచి కేసీఆర్ ఇప్పటికే రిపోర్టు తెప్పించుకున్నట్టు పార్టీ నేతల టాక్. యాదవ కులం నుంచి నోముల నర్సింహయ్య కొడుకు భగత్‌తో పాటు గురువయ్య యాదవ్, రంజిత్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నోముల కొడుక్కే టికెట్ ఇవ్వాలని, సామాజికవర్గం ఓట్లతో పాటుగా సానుభూతి కలిసి వస్తుందని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పట్టుపడుతున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాత్రం రెడ్డి కులం నుంచి ఎమ్మెల్సీ తేరా చిన్నపురెడ్డి, ఎంసీ కోటిరెడ్డి పేర్లను ప్రపోజ్ చేస్తున్నారు. అటు బడుగుల లింగయ్య యాదవ్ కూడా గురవయ్య యాదవ్ కోసం సీఎం దగ్గర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ నేడో.. రేపో పార్టీ నేతలతో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దీని కోసం ఇప్పటికే గుత్తా, మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు నేతలను ప్రగతిభవన్‌కు రావాలంటూ సమాచారమందించారు.