ఉదారత చాటుకున్న ఉపాధ్యాయుడు

by Shyam |
ఉదారత చాటుకున్న ఉపాధ్యాయుడు
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్ : అనాథ విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుడు ఉదారతను చాటుకున్నారు. నారాయణ పేట జిల్లా కోస్గి మండలం హనుమాన్ పల్లి గ్రామానికి చెందిన రాఘవేందర్ రెడ్డి దామరగిద్ద మండలం మొగల్ మడక ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ( భౌతిక శాస్త్రం) గా విధులు నిర్వహిస్తున్నారు. అనాథ విద్యార్థుల కు తన శక్తి మేరకు చేయుతనిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు రాఘవేందర్ రెడ్డి .

ఆదివారం మహబూబ్ నగర్ లోని ఏనుగొండ రెడ్ క్రాస్ అనాథాశ్రమానికి 6క్వింటాళ్ల బియ్యం ( రూ.20 వేల విలువ), రూ 20 వేల విలువ చేసే నిత్యావసర సరుకులు ( కంది పప్పు, మంచి నూనె, కేసరి రవ్వ, సన్న రవ్వ, కారం,బెల్లం, చక్కెర) అందజేశారు. గత ఏడాది రూ.30 వేల విలువ చేసే బియ్యం,నిత్యావసర సరుకులు అందజేసిన రాఘవేందర్ రెడ్డి ఈ సారి రూ.40 వేల విలువ చేసే బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజు అన్నారు. రాఘవేందర్ ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ అనాథ విద్యార్థులను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. కాగా అనాథ విద్యార్థుల పట్ల ఉదారత ను చాటుతున్న ఉపాధ్యాయుడు రాఘవేందర్ రెడ్డిని రెడ్ క్రాస్ కోశాధికారి జగపతి రావు, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త అశ్విని చంద్రశేఖర్ లు అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed