కేసీఆర్ మాటకు ఆయన నియోజకవర్గంలోనే విలువ లేదా…?

by Anukaran |
కేసీఆర్ మాటకు ఆయన నియోజకవర్గంలోనే విలువ లేదా…?
X

దిశ‌, న‌ర్సాపూర్‌ : తెలంగాణ రాష్ట్రానికే ముఖ్యమంత్రి కేసీఆర్. అలాంటి కేసీఆర్ మంచికోసం చెప్పిన మాటను ప్రజలతో పాటు అధికారులు సైతం తుచా తప్పకుండా పాటించాల్సిందే. అలాంటిది సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే ఆయన మాటకు విలువ లేకుండా పెడ చెవిన పెట్టారు అధికారులు. అదేటంటే.. కరోనా టీకా కార్యక్రమం మెద‌క్ జిల్లాలో కొన‌సాగుతుంది. అయితే సీఎం కేసీఆర్ ప్రాతినిద్యం వ‌హిస్తున్న గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని తూప్రాన్ ప్రభుత్వ ఆసుప‌త్రికి కొవిడ్ టీకా కోసం శ‌నివారం నాడు జ‌నం పెద్ద సంఖ్యలో త‌ర‌లివ‌చ్చారు. క‌చ్చితంగా సోష‌ల్‌ డిస్టెన్స్ పాటించి మాస్కలు ధ‌రించాల‌ని ఇప్పటికే చాలా సార్లు కేసీఆర్ మీడియా వేదికగా, బహిరంగ సభల్లో, వివిధ కారక్రమాల్లో చెప్పినా నిబంధనలు వ‌స్మరించి కుప్పలు తెప్పలుగా వ్యాక్సిన్ సెంటర్‌కు వ‌చ్చారు.

టీకా కోసం వచ్చిన వారి సంగతి పక్కన పెడితే.. వారికి సరైన అవగాహన కల్పించాల్సిన అధికారులు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. మూడు రోజుల నుండి వ్యాక్సిన్ కోసం తిరుగుతున్నా, రేపు రా అంటూ పంపేస్తున్నారని, సరైన సమాధానం కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొందరు మహిళలుు వాపోతున్నారు. వ్యాక్సిన్ సెంటర్‌లో కనీసం సూచిక బోర్డులు కూడా లేవు. సమయానికి వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో సంయమనం పాటించాల్సిన కొందరు ఏఎన్ఎంలు టీకా కోసం వచ్చిన వారిపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా కేసీఆర్ స్వంత నియోజకవర్గంలోనే ఆయన మాటను పక్కన పెట్టి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed