1983 వరల్డ్‌ కప్‌.. భారత ఆటగాళ్ల వేతనం ఎంతో తెలుసా..?

by Anukaran |   ( Updated:2021-02-01 06:59:43.0  )
1983 వరల్డ్‌ కప్‌.. భారత ఆటగాళ్ల వేతనం ఎంతో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: కపిల్ దేవ్ నాయకత్వంలో 1983లో తొలిసారిగా టీమిండియా ప్రపంచ కప్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ కప్‌ను అప్పట్లో ప్రుడెన్షియల్ కప్‌గా నామకరణం చేశారు. 1983కు ముందు కనీసం టెస్టు హోదా కూడా కలిగిలేని టీమిండియా.. దిగ్గజ జట్లను ఓడించి.. కపిల్ సారథ్యంలో వరల్డ్ కప్ కొట్టడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అదే ఉత్సాహంతో ఇండియాలో క్రికెట్‌ రంగం వేగంగా పుంజుకుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, 1983లో భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఆటగాళ్ల వేతనాలు తెలిస్తే షాక్ అవుతారు.

1983 ప్రుడెన్షియల్ కప్‌లో భాగంగా మూడు మ్యాచులు ఆడిన భారత జట్టులో 14 ఆటగాళ్లతో పాటు మేనేజర్ బిషన్ సింగ్ బేడీ ఉన్నారు. ఈ 15 మందికి మూడు రోజుల అలవెన్స్ కింద ప్రతీ రోజు రూ. 200 చొప్పున మూడు రోజులకు 600లు ఇచ్చారు. అలాగే, మ్యాచ్ ఫీజ్‌‌లో భాగంగా ప్రతీ ఒక్కరికి రూ. 1500 చెల్లించారు. అంటే ఆ సమయంలో వరల్డ్ కప్ ఆడిన ఆటగాళ్ల వేతనం రూ. 2100 మాత్రమే. ఈ విషయాన్ని ఓ క్రికెట్ జర్నలిస్ట్‌ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేయగా.. ఇది వైరల్‌గా మారింది.

అయితే, అప్పుడు డబ్బు కంటే ఎక్కువ.. దేశం తరఫున ఆడటానికి ప్రొత్సాహం, విలువ ఉండేదని మాజీ క్రికెటర్లు స్పష్టం చేస్తుంటారు. కానీ, ప్రస్తుత కాలంలో క్రికెట్ ఆటగాళ్లు లక్షల్లో, కోట్లల్లో సంపాధించడం విశేషం. కేవలం దేశీయ మ్యాచ్‌లు‌, లీగ్ మ్యాచుల్లోనే ఆటగాళ్లు కోట్లు సంపాధిస్తున్నారంటే అది 1983లో భారత జట్టు కప్ కొట్టిన పుణ్యమే అంటూ క్రికెట్ విశ్లేషకులు బలంగా వాదిస్తున్నారు. అప్పటి నుంచే బీసీసీఐ ప్రాధాన్యత ప్రపంచ క్రికెట్‌లో పెరిగిందని చెప్పాలి. దీంతో క్రికెట్ రంగానికి భారీ డిమాండ్ పెరిగి.. అత్యంత సామర్థ్యాలు గల ఆటగాళ్లతో టీమిండియా ప్రపంచ దేశాల్లోనే టాప్ పొజిషన్‌లో ఉంది.

1983లో టీమిండియా జట్టు ఇదే..

1. కపిల్ దేవ్(కెప్టెన్)

2.మోహిందర్ అమర్‌నాథ్(వైస్ కెప్టెన్)

3.సునీల్ గవాస్కర్

4. కృష్ణమాచారి శ్రీకాంత్

5. యశ్పాల్ శర్మ

6. సందీప్ పాటిల్

7. కీర్తి ఆజాద్

8. రోజర్ బిన్నీ

9. మదన్ లాల్

10. సయ్యద్ కిర్మాణీ

11. బల్వింధర్ సంధు

12. దిలీప్ వెంగసర్కార్

13. రవి శాస్త్రి

14. సునీల్ వాల్సన్

మేనేజర్: బిషన్ సింగ్ బేడీ

Advertisement

Next Story