- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కట్నం వద్దనుకుంటున్నారా? ఇలా స్వయంవరానికి రెడీ అవ్వండి..!

దిశ ప్రతినిధి, మేడ్చల్: కట్నం తీసుకునేవాడు గాడిద అని అంటారు.. మేము గాడిదలమే అంటూ కొందరు కట్నం కోసమే పెళ్లి చేసుకుంటారు. తల్లిదండ్రులు కూడా అంతే కొడుకుకు కట్నం ఎక్కువగా తెచ్చే కోడలు రావాలని కోరుకుంటారు.. ఇకపోతే ఇప్పుడు కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరమని అంటున్నారు. అయితే అలాంటి వాటి గురించి ప్రస్తావించిన కూడా జైలు శిక్ష తప్పదు అని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి.. ఇక అసలు విషయానికొస్తే ఓ వివాహ వేదిక సరికొత్త ఆలోచనలతో ముందుకు వచ్చింది.. స్వయం వరం పేరుతో వివాహాలను జరిపిస్తున్నారు.
వరకట్నం సాంఘిక దురాచారమని భావించే నేటితరం యువతకు సరికొత్త వివాహ వేదిక ఆహ్వానం పలుకుతున్నది. కట్నకానుకలు ఆశించకుండా వివాహాలు చేసుకునే వారిని ‘ఐ డోంట్‌వాంట్ డౌరీ డాట్‌కామ్’ సంస్థ ప్రోత్సహిస్తున్నది. విశాల భావాలు ఉన్న వారిని వివాహ బంధంతో ఒక్కటయ్యేలా చేస్తున్నామని సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 15 ఏండ్లుగా ఈ స్వయంవరాన్ని నిర్వహిస్తున్నామని, కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తునట్టు తెలిపారు.
పదహారవ సారి స్వయంవరం వివహవేదిక..
ఈ నెల 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జూమ్‌యాప్ ద్వారా ఈ సారి ఆన్‌లైన్ వేదికగా స్వయం వరాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు ..ఈ స్వయం వరం లో పాల్గొనాలని అనుకునేవారు ముందుగా సంబంధిత వెబ్ సైట్ లో వారి వివరాలను పొందు పరచాలని విజ్ఞప్తి చేశారు. www.idontwantdowry.com వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి వారి పూర్తి వివరాలను పొందుపరచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.. లేదా 98858 10100 నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.