హైదరాబాద్‌లో ‘మూసీ’.. తెలంగాణలో ‘కేసీఆర్’.. రెండూ కంపే?

by Aamani |
హైదరాబాద్‌లో ‘మూసీ’.. తెలంగాణలో ‘కేసీఆర్’.. రెండూ కంపే?
X

దిశ, ఖానాపూర్ : రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలనకు త్వరలోనే ప్రజలు చమరగీతం పాడబోయే రోజులు వస్తాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో జరుగుతున్న మూడు రోజుల బీజేపీ శిక్షణా శిబిరంలో ఆఖరి రోజు ముఖ్య అతిథిగా డీకే అరుణ విచ్చేసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ నియంతలా పాలనగా సాగిస్తు్న్నారని తెలిపారు. ఆ పాలనకు చమరగీతం పాడాలంటే అది బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ చెబుతున్న అబద్ధాలతో విసుకు చెందారని చెప్పారు. 2023 కంటే ముందే ఈసారి కూడా ముందస్తు ఎలక్షన్స్ వస్తాయని, రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. హైదరాబాద్‌లో మూసీ నది ఎంత మురికిగా మారిందో అదే విధంగా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అంత కంపు కొడుతుందన్నారు. రాబోవు ఎలక్షన్లలో కేసీఆర్ ప్రజాగ్రహానికి కొట్టుకుపోవడం ఖాయమన్నారు.కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి, జిల్లా సహా ఇన్చార్జి మ్యాన మహేష్, నిర్వహణ సమితి ప్రముఖ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మె రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి, సామా రాజేశ్వర్ రెడ్డి, పడిపెళ్లి గంగాధర్, రావుల రాంనాథ్, అజ్మీరా హరినాయక్, పడల రాజశేఖర్, నాయిని సంతోష్, జడ్పీటీసీ జను భాయ్, రజిని, తోకల బుచ్చన్న యాదవ్, తాలోడి శ్రీనివాస్, వడ్లకొండ అలివేలు, మిట్టపల్లి రాజేందర్, శ్రావన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed