యూఎస్ ఓపెన్‌లో జకోవిచ్ దూకుడు

by Shiva |
యూఎస్ ఓపెన్‌లో జకోవిచ్ దూకుడు
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా లాక్‌డౌన్ అనంతరం జరుగుతున్న తొలి టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. శుక్రవారం రాత్రి (ఇండియాలో శనివారం ఉదయం) జాన్ లెర్నాడ్‌తో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించి నాలుగో రౌండ్‌లోకి ప్రవేశించాడు. లెర్నాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6-3, 6-3, 6-1 తేడాతో వరుస సెట్లను గెలుచుకొని జకోవిచ్ విజయం సాధించాడు.

గంటన్నరపైగా సాగిన ఈ మ్యాచ్‌లో జకోవిచ్ దూకుడు కారణంగా ఏకపక్షంగా జరిగింది. కాగా, ఇది జకోవిచ్‌కు వరుసగా 29వ విజయం కావడం గమనార్హం. యూఎస్ ఓపెన్‌లో మెరుగైన రికార్డ్ ఉన్న జకోవిచ్.. 2011, 2015, 2018లో ఈ గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచాడు. ఈ సారి కూడా యూఎస్ ఓపెన్ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నట్లు ఇంతకు ముందే మీడియాకు వెల్లడించాడు.

మరోవైపు పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న-డెనిషా జంట రెండో రౌండ్‌కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్‌ విభాగంలో నంబర్‌ వన్‌ క్రీడాకారిణి అయిన జపాన్‌ స్టార్‌ నవోమి ఒసాకా నాలుగో రౌండ్‌కు చేరింది. శుక్రవారం ఉక్రెయిన్‌ స్టార్‌ మార్తా కోస్త్యుక్‌తో తలపడిన మూడో రౌండ్‌లో 6-3, 6-7 (4), 6-2 తేడాతో ఒసాకా విజయం సాధించింది. ఇక భారత్‌కు చెందిన సుమిత్ నాగల్ యూఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు.

Advertisement

Next Story