- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తేజస్విని హత్య కేసులో ఊహించని పరిణామం..
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్ :
బెజవాడలో ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. విచారణలో భాగంగా నిందితుడితో పాటు అతని స్నేహితుడిని ప్రశ్నించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ప్రణాళిక ప్రకారమే దివ్యను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హత్యకు ముందు రోజు నాగేంద్ర కాల్‌డేటాను పోలీసులు పరీశీలించారు.
అంతేకాకుండా మర్డర్ చేయడానికి కొద్దిసేపటికి ముందు నిందితుడు తన స్నేహితుడికి ఫోన్ చేసినట్లు గుర్తించారు. నాగేంద్ర స్నేహితుడు వెల్లడించిన వివరాల ఆధారంగా తేజస్విని హత్యకేసును దిశా పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో దివ్య కుటుంబ సభ్యులతో పాటు, చుట్టు పక్కల వారిని దిశా టీం విచారిస్తోంది. డీజీపీ ఆదేశాల మేరకు దిశ బృందం శాస్త్రీయ ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది.
Next Story