- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనా నియంత్రణకు ‘దివిస్’ కృషి
by Shyam |

X
దిశ, నల్లగొండ: చౌటుప్పల్ పురపాలిక కేంద్రంలో కరోనా కట్టడికి దివిస్ లాబొరేటరీస్ సంస్థ రూ. 7 కోట్ల రూపాయలతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెంలోని దివిస్ లాబొరేటరీస్ యజమాన్యం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి గత మూడు నెలలుగా అనేక రకాలుగా కృషి చేస్తోంది. ఇటీవల చౌటుప్పల్ పురపాలిక కేంద్రంలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కరోనా నియంత్రణకు పురపాలిక పాలకవర్గంతో కలిసి 50 మంది ప్రత్యేక సిబ్బందిని నియమించి 5000 లీటర్ల సోడియం హైపోక్లోరైడ్, 300 లీటర్ల ఫినాయిల్, 500 లీటర్ల శానిటైజర్, 200 లీటర్ల మాలిథోం ద్రావణాలను సిద్ధం చేసింది. 25,000 మాస్కులను పంపిణీ చేసింది. కార్యక్రమంలో పురపాలిక ఛైర్మన్ వేన్రెడ్డి రాజు, వైస్ ఛైర్మన్ శ్రీశైలం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Next Story