- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు సువర్ణావకాశం.. హైదరాబాద్‌లో జాబ్ మేళా
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : నిరుద్యోగులైన యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు గాను ఈనెల 25వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మైత్రి ప్రియ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు . హైదరాబాద్ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువకులు విజయ్ నగర్ కాలనీ ప్రభుత్వ ఐటీఐ వద్ద ఉన్న జిల్లా ఉపాధికార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు.
అపోలో ఫార్మసీ లో ఫార్మాసిస్ట్ , అసిస్టెంట్ ఫార్మాసిస్ట్ వంటి ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్ మేళా ఉంటుందన్నారు. బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ , డీ ఫార్మసీ , పదవ తరగతి,ఇంటర్, డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులని, ఎంపికైన వారికి రూ 10 వేల నుండి రూ 15 వేల వరకు వేతనాలు ఇవ్వబడతాయని ఆమె తెలిపారు. 18 నుండి 30 సంవత్సరాల పై వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు . ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ బయోడేటా, రెస్యూమ్,విద్యార్హత సర్టిఫికెట్లతో జిల్లా ఉపాధి కార్యాలయంలో సంప్రదించాలని ఆమె సూచించారు. ఇతర వివరాలకు టీ రఘుపతి ఫోన్ నెం 8147656356 నెంబర్ లో సంప్రదించాలని కోరారు.