- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిపోయిన గుడ్ల పంపిణీ
X
దిశ, నేరేడుచర్ల: గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు, బాలింతలకు పౌష్టికాహారం కోసం బాలామృతం పథకం ద్వారా ప్రభుత్వం కోడిగుడ్లను పంపిణీ చేస్తోంది. కొన్ని ఏజెన్సీల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లను ప్రభుత్వం సరఫరా చేయిస్తోంది. అయితే ఏజెన్సీలు నాణ్యమైన గుడ్లను సరఫరా చేయకపోవడంతో ఆ గుడ్లు పదిహేను రోజులకే కుళ్లిపోతున్నాయి. నేరేడుచర్ల మున్సిపాలిటీలోని రాజీవ్ నగర్ పట్టణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో కొందరు పిల్లలకు, బాలింతలకు గుడ్లను పంపిణీ చేశారు. వాటిని ఇంటికి తీసుకువెళ్లిన లబ్ధిదారులు పగులగొట్టి చూడగా గుడ్లు పూర్తిగా కుళ్లిపోయాయంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నాణ్యమైన గుడ్లను పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Next Story