దిశ ఎఫెక్ట్: వైద్యకేంద్రాల్లో అధికారుల ఆకస్మీక తనిఖీలు

by Anukaran |   ( Updated:2021-05-12 05:38:54.0  )
దిశ ఎఫెక్ట్: వైద్యకేంద్రాల్లో అధికారుల ఆకస్మీక తనిఖీలు
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలో కరోనా పరీక్షల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ‘దిశ’ దినపత్రికలో ప్రచురితమైన ‘పరీక్షల కోసం ప్రజల పడిగాపులు’ అనే శీర్షికకు స్పందన వచ్చింది. ఈ శీర్షికపై స్పందించి అధికారులు బుధవారం జిల్లా వైద్యాధికారి ఏజెన్సీ ప్రాంతంలోని అచ్చంపేట, అమ్రాబాద్, పదర మండలాలలో పర్యటించి వైద్య కేంద్రాలను ఆకస్మీకంగా తనిఖీ చేశారు. అమ్రాబాద్ మండల కేంద్రంలో గల వైద్య కేంద్రాన్ని తనిఖీ చేస్తూ వైద్య సిబ్బంది అందరూ హాజరయ్యారా, రోగులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు, ఐసోలేషన్ కేంద్రాలలో ఉంటున్న వారికి వైద్య సేవలపై ఆరా తీశారు. నల్లమల ప్రాంతంలో గల అమ్రాబాద్, పదర మండలంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధాకర్ లాల్ పర్యటించారు. ముందుగా ఆయన పదర మండలంలోని చిట్లంకుంట గ్రామంలో కొవిడ్ నిర్దారణ అయిన వారి ఇళ్లను సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

తదుపరి అమ్రాబాద్ మండల కేంద్రం దళాల వైద్య కేంద్రంలో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న వారికితో మాట్లాడి వారి ఆరోగ్య విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ సోకిన వారు అధైర్య పాడొద్దని, ఇంట్లోనే వుంటూ ఐసోలాషన్ నిబంధనలు పాటించాలని, వ్యాధి సోకిన వారి కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతలు పాటిస్తూ ప్రభుత్వ నిబంధనలు, సూచనలు పాటించిన వారు, వ్యక్తిగత, ప్రభుత్వ వైద్య కేంద్రాలలో ఐసోలేషన్‌లో ఉంటూ జాగ్రత్తలు తీసుకున్న వారు ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్తున్నారని గుర్తుచేశారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ఆయనతోపాటు జిల్లా ఉప వైద్య అధికారి శ్రీధర్ డాక్టరులు నాగరాజు, అనిల్ నాయక్, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story