నిర్భయ కేసు నిర్దయ లాయర్

by Shamantha N |   ( Updated:2020-02-01 06:04:41.0  )
నిర్భయ కేసు నిర్దయ లాయర్
X

దేశంలో మానవమృగాలు తిరుగుతున్నాయయ్. ఆ మృగాలకు బలైన అబలల సంఖ్య పెరుగుతోంది. మొన్న నిర్భయ… నిన్న దిశ, సమత. కాలం మారినా… అబలలు సబలలుగా మారినా… మానవమృగాల వేట కొనసాగుతూనే ఉంది. ప్రబుద్ధుల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయ్.

2012లో ఢిల్లీలో నిర్భయపై జరిగిన అత్యాచారం, హత్య కేసు నిందితులు ఎనిమిదేళ్లుగా ఉరిశిక్ష నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. రాజ్యాంగంలోని లొసుగులు వాడుకుంటూ … కోర్టుకు వెళ్లి సేఫ్ గా తిరిగొస్తున్నారు. అయితే ఫిబ్రవరి 1న నిర్భయ కేసు నిందితులకు ఉరిశిక్ష అని కన్ ఫాం అయింది. అయితే దోషులు ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో వేసిన పిటిషన్ మళ్లీ వారిని కాపాడింది. ఉరికి వ్యతిరేకంగా తమకున్న న్యాయ మార్గాలు ఇంకా ఉన్నాయని.. రాష్ట్రపతి క్షమాభిక్ష ఓ అవకాశంగా ఉందని … దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ వాదించాడు. వారి వాదనలు జనవరి 31న విన్న కోర్టు ఉరిశిక్షను వాయిదా వేసింది.

దీంతో నిర్భయ తల్లి హతాశురాలైంది. దోషులకు శిక్ష వేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని వాపోయింది. ఈ క్రమంలో నిర్భయ తల్లి ఆశాదేవికి చేయి చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు దోషుల తరపు న్యాయవాది ఏ పీ సింగ్. వాయిదాల పర్వం శాశ్వతంగా కొనసాగుతుందని…. వారికి శిక్ష పడనివ్వనని చెప్తూ వెళ్లిపోయాడు.

అయితే న్యాయవాది ప్రవర్తనపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ ఈ విషయంపై ట్వీట్ చేశారు. లాయర్ ఏ పీ సింగ్ ప్రవర్తన చాలా విసుగ్గా ఉందంటూ ట్వీట్ చేశారు. దోషులకు తరపు న్యాయవాది నుంచి ఇలాంటి ప్రవర్తన వింతగా ఉందని… నిర్భయ దోషులకు శిక్ష పడాలని డిమాండ్ చేశాడు ఆర్జీవీ.

Advertisement

Next Story

Most Viewed