వినాయక చవితికి ‘లాభం’.. సేతుపతికి బాబీ సాయం

by Shyam |   ( Updated:2021-08-31 04:53:57.0  )
వినాయక చవితికి ‘లాభం’.. సేతుపతికి బాబీ సాయం
X

దిశ, సినిమా : విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘లాభం’ చిత్రం ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు బాబీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విజయ్ సేతుపతి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇటీవల తెలుగులో సేతుపతి నేరుగా నటించిన ‘సైరా’, ‘ఉప్పెన’ చిత్రాల్లో ఆయన పాత్రలకు మంచి అప్లాజ్ వచ్చింది. ఇందులో రైతుల సమస్యలపై పోరాడే యువకుని పాత్రలో ప్రేక్షకుల్ని అలరిస్తారనే నమ్మకం ఉంది. ఈ చిత్రం విజయం సాధించి, మంచి లాభాలు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నా’ అన్నారు.

‘మాస్టర్’, ‘ఉప్పెన’ తర్వాత సేతుపతి తెలుగులో నటిస్తున్న చిత్రం ఇదే కాగా, ఆయన హీరోగా నటించిన చిత్రం మొదటిసారిగా రెండు భాషల్లోనూ విడుదలవుతోంది. జగపతిబాబు విలన్ పాత్రలో, సాయి ధన్సిక మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. SP జననాథన్ డైరెక్ట్ చేసిన చిత్రాన్ని శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కాగా ఈ కార్యక్రమంలో బాబీతో పాటు ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి వై పాల్గొన్నారు. ఇక ఈ సినిమాకు డి ఇమాన్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం.

Advertisement

Next Story

Most Viewed