- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏడాది కాలంలో యూపీఐ లావాదేవీల వృద్ధి 288 శాతం
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశీయంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, యాప్‌లు గతేడాది భారీగా వృద్ధిని సాధించినట్టు ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పే-యూ వెల్లడించింది. కంపెనీ తెలిపిన ప్రకారం..ఆన్‌లైన్ గేమింగ్, కామర్స్, పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లు ఏడాది కాలంలో 100 శాతానికి పెరిగాయి. యూపీఐ లావాదేవీల సంఖ్య 288 శాతం, యూపీఐ ద్వారా చేసే ఖర్చులు 2019-2020 మధ్య 331 శాతం వృద్ధి నమోదవడం ద్వారా ఆన్‌లైన్ చెల్లింపుల్లో మహమ్మారి భారీగా మార్పులు తీసుకొచ్చినట్టు పే-యూ అభిప్రాయపడింది. అదే సమయంలో ఓటీటీ విభాగంలో లావాదేవీల సంఖ్య 144 శాతం పెరిగాయి. గేమింగ్ విభాగంలో ఖర్చులు 100 శాతం పెరిగాయి. రిటైల్, ఈ-కామర్స్ విభాగంలో లావాదేవీల సంఖ్య 106 శాతం వృద్ధి నమోదైంది. ప్రధానంగా దేశంలోని ప్రజలు ఎక్కువగా అవసరమైన వస్తువులను కొనేందుకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌నే వినియోగించారని పే-యూ వివరించింది. అదేవిధంగా చాలావరకు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉండటం, విద్యార్థులు ఆన్‌లైన్ విద్యకు మారడంతో ఎడ్‌టెక్ విభాగంలో లావాదేవీలు 78 శాతం పెరిగాయి. అలాగే, ఈ విభాగంలో ఖర్చులు 44 శాతం పెరిగినట్టు పే-యూ వెల్లడించింది.