- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎక్కడున్నా సరే వదిలేదే లేదు.. ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందే..
దిశ,తుంగతుర్తి: ప్రస్తుతం ప్రపంచ దేశాలన్ని ఒమిక్రాన్ కరోనాతో అప్రమత్తం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలని రాష్ట్రాలను ఆదేశించింది. దీంతో కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న వైద్య సిబ్బందికి ఎదురవుతున్న కష్టాలు వర్ణనాతీతం. ముఖ్యంగా గ్రామాల్లో వారికి ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారికి వ్యాక్సిన్ పట్ల ఉన్న అపోహ వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే వైద్య సిబ్బందికి దూషణలు, తిట్ల పురాణాలు పెద్ద ఎత్తున ఎదురవుతున్నాయి. అయిన వారు అవేమీ పట్టించుకోకుండా లక్ష్య సాధనలో ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా గ్రామాలలో ఏ ఒక్కరిని కూడా వదలకుండా వైద్య సిబ్బంది ప్రతి ఇంటిని, వ్యవసాయ క్షేత్రాలను జల్లెడ పడుతున్నాయి.
వ్యాక్సిన్ తీసుకోని వారి వివరాలను రహస్యంగా సేకరిస్తున్నారు. వెంటనే ఎవరికి తెలియకుండానే వారి గృహాలకు చేరుకొని అతి కష్టం మీద వ్యాక్సిన్ ఇస్తున్నారు. కొంతమంది వైద్య సిబ్బందికి ఎదురుతిరిగి దుర్భాషలాడుతున్నప్పటికీ ఓపికతో చుట్టుపక్కల వారి సహాయం తీసుకొంటున్నారు. ముఖ్యంగా వైద్య, ఆశ, అంగన్వాడి, తదితరుల బృందం సంయుక్తంగా పర్యటిస్తూ ఏ ఒక్కరు ఉన్నా కూడా వదిలిపెట్టకుండా వ్యాక్సిన్ వేస్తున్నారు. జిల్లాకు పూర్తి సరిహద్దుల్లో ఉన్న తుంగతుర్తి మండలంలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి.