‘లేఖలు’ చేయలేనివి ‘గులాబీ రేకులు’ చేసెనే

by Anukaran |   ( Updated:2021-02-06 12:06:49.0  )
‘లేఖలు’ చేయలేనివి ‘గులాబీ రేకులు’ చేసెనే
X

దిశ,వెబ్‌డెస్క్ : ప్రేమికుల రోజు దగ్గరకు వస్తోంది. వాలంటైన్స్ డే ను ఘనంగా జరుపుకునేందుకు ఇప్పటికే చాలా మంది ప్రేమికులు రెడీ అయ్యారు. ఆదివారం(07-ఫిబ్రవరి) నుంచి వాలంటైన్స్ వీక్ ప్రారంభం కాబోతోంది. అందులో మొదటి రోజు ‘రోజ్ డే’ మరీ ప్రత్యేకం. ఇప్పటికే తమ ప్రేమను వ్యక్త పరిచేందుకు రంగు రంగుల గులాబీలను ప్రేమికులు సిద్దం చేసుకుంటుండగా.. వారి ముఖాల్లో ఆనందాన్ని విరబూయించేందుకు గులాబీలు రెడీగా ఉన్నాయి. అయితే ‘రోజ్ డే’ సందర్భంగా ఏ కలర్ ఫ్లవర్ ఇవ్వాలి.. ఏ రంగు ఏ భావాన్ని తెలుపుతుంది.. మనం అందించే ఫ్లవర్ ఎదుటివారికి తమ ప్రేమను ఎలా వ్యక్తపరుస్తుందో తెలియాలంటే రీడ్ దిస్ స్టోరీ..

ప్రేమను తెలపాలంటే లెటర్ కన్నా ఫ్లవర్ బెటర్ అంటారు కొందరు. ఎందుకంటే ప్రేమ గురించి రాయాలంటే అక్షరాలు తడబడుతాయి. ఆలోచనలు ఉరకలు పెట్టిస్తే.. భయాలు అడ్డుకట్టలు వేస్తాయి. అందుకే కలం కదలదు.. రాయాలన్న కోరిక వీడదు. ఆ సమయంలో నవ ప్రేమికులకు ఎదురయ్యే పరిస్థితి వర్ణనాతీతం. అదే ఫ్లవర్ అయితే సింపుల్‌. లేఖలు చేయలేని పనిని గులాబీ రేకులు చేసి పెడతాయి. ప్రేమికుడి మనసులో గూడు కట్టుకున్న భావాలను ఆ ఫ్లవర్ ఇట్టే తెలియ పరుస్తుంది. అయితే ఒక్కో రంగు ఒక్కో భావాన్ని తెలుపుతుంది.

రెడ్ రోజ్:

రెడ్ రోజ్ అనేది నిజమైన ప్రేమకు చిహ్నంగా వర్ణిస్తారు. స్ట్రాంగ్ రొమాంటిక్ లవ్‌కు సింబల్. అందుకే ప్రేమికులు తమ ప్రేమను వ్యక్త పరిచేందుకు వీలుగా ఎక్కువగా ఈ ఎరుపు రంగు గులాబీలను ఎంచుకుంటారు.

యెల్లో రోజ్:

యెల్లో రోజ్ అనేది స్నేహానికి చిహ్నంగా భావిస్తారు. మనలో నిండిన ఆనందాన్ని, ఉత్సాహాన్ని యెల్లో కలర్ రిప్రజెంట్ చేస్తుంది. అంతే కాకుండా యెల్లో కలర్ అనేది పాజిటివ్ ఇంపాక్ట్‌కు ప్రతీక. అవతలి వ్యక్తిపై మనకు ఉన్న కేరింగ్‌ను సూచిస్తుంది. ఈ ఫ్లవర్‌ను స్నేహానికి గుర్తుగా స్నేహితులు కూడా ఇచ్చి పుచ్చుకుంటారు.

ఆరెంజ్ రోజ్:

ఆరెంజ్ కలర్ రోజ్ విషయానికి వస్తే…ఇది ఉత్సాహాన్ని, పాషన్‌ను ప్రతిబింబిస్తాయి. అవతలి వ్యక్తిపై మనకు ఉన్న అమితమైన ప్రేమను చూపించడానికి ఈ ఫ్లవర్‌ను ఇస్తుంటారు.

పింక్ రోజ్:

పింక్ రోజ్ కొత్త బంధాలను ప్రారంభించే సందర్భాల్లో ఎక్కువగా ప్రెజెంట్ చేస్తుంటారు. ఆప్యాయతకు గుర్తుగా ఈ గులాబీ నిలుస్తుంది. తమ ప్రేమను అసాధారణ మార్గంలో ఎక్స్‌ప్రెస్ చేసేందుకు ఈ రోజెస్‌ను ఎంచుకోవచ్చు.

వైట్ రోజ్:

తెలుపురంగు గులాబీలు శాంతి సూచకంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా అమాయకత్వానికి ఇది కేరాఫ్. వీటిని ఎక్కువగా పీస్ కోసం, సంతాపం తెలిపే సందర్బాల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. అందువలన దీనిని లవర్స్ ఎంచుకోకపోవడం మంచిది.

లావెండర్ రోజ్:

చాలా మంది అవర్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. అలాంటి వారికి ఈ రంగు ఫ్లవర్‌ బాగా సరిపోతుంది. ఒక వ్యక్తిని బాగా ఆరాధిస్తున్నప్పుడు వారికి ఆ ఎమోషన్‌ను వ్యక్త పరిచేందుకు లావెండర్ రోజ్‌ను మించింది లేదు.

బ్లూ రోజెస్:

ప్రేమలో ఉన్న వారిలో కవిత్వం పొంగుకు వస్తుంది. నీ గురించి ఆలోచించ కుండా ఉండలేకపోతున్నాను..నీ ఆలోచనలు ఎప్పుడూ నా మనసును తాకుతున్నాయి అంటూ వారిదైన శైలిలో భావాలను వ్యక్త పరుస్తుంటారు. అలాంటి ఫీలింగ్స్‌ను ఎక్స్ ప్రెస్ చేసేందుకు ఇది పర్ ఫక్ట్ గిఫ్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం మీ లవర్‌ను సర్ ప్రైజ్ చేయడంతో పాటు వారిపై మీకున్న ఫీలింగ్‌ను వ్యక్తపరచడానికి ఏ రంగు కావాలో ఎంచుకోండి.

Advertisement

Next Story

Most Viewed