- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పుట్టిన రోజు కాలు జారిన డీఎస్.. ఫొటో వైరల్..!

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ భుజానికి ఫ్రాక్చర్ అయింది. సోమవారం డీఎస్ పుట్టిన రోజును పురస్కరించుకొని తన ఇంట్లోనే ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత పూజ గదిలో నుంచి బయటికొస్తుండగా కాలు జారి కింద పడిపోయారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. కానీ, భుజానికి ఫ్రాక్చర్ అయ్యింది. మరో నాలుగు రోజుల్లో సర్జరీ చేస్తామని వైద్యులు తెలిపారు. హాస్పిటల్‌లో ఎంఆర్ఐ, ఎక్స్‌రేలు చేయించిన అనంతరం ఇంటికి తీసుకొచ్చాము అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒక ఫొటోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఇప్పుడు అది కాస్తా వైరల్ అవుతోంది.
Next Story