- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్విజ్ ఆడాలా? ధరణి యాప్ ఓపెన్ చేయండి!
దిశ, తెలంగాణ బ్యూరో : ‘స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు. ఎక్కడ ఉన్నా మీ భూములను చెక్ చేసుకోవచ్చు. అంత పారదర్శకంగా ధరణి పోర్టల్ ను రూపొందించాం’.. ధరణి పోర్టల్ ఆవిష్కరణలో సీఎం కేసీఆర్. నిజమే.. వెబ్ సైట్ లోనైతే ఫర్వాలేదు. కానీ ప్రభుత్వం ప్రజల కోసం రూపొందించినదంటూ ప్రచారంలో ఉన్న యాప్ గందరగోళానికి గురి చేస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ లో ధరణి యాప్ అని టైప్ చేస్తే చాలు.. కుప్పలుతెప్పలుగా అనేకం యాప్ ల లింకులు వచ్చేస్తున్నాయి. వాటిలో ప్రభుత్వం రూపొందించినదేదో అంతుచిక్కడం లేదు. అన్నీ తెలంగాణ ధరణి పేరుతోనే కనిపిస్తున్నాయి. తెలంగాణ ధరణి ల్యాండ్ రికార్డ్స్, తెలంగాణ ధరణి యాప్, తెలంగాణ ధరణి ఆర్వోఆర్ 1 బి, ధరణి ఆన్ లైన్ తెలంగాణ, తెలంగాణ ల్యాండ్ రికార్డ్స్, ధరణి టెక్ వెబ్, తెలంగాణ భూమి, తెలంగాణ ధరణి, ధరణి.. ఇలా పదుల సంఖ్యలో ఉన్నాయి. పైగా వీటిలో చాలా యాప్స్ డౌన్ లోడ్స్ వేలల్లో ఉన్నాయి. కొన్ని యాప్స్ డౌన్ లోడ్స్ 100 కె వరకు చూపిస్తున్నాయి. ప్రతి యాప్ డౌన్ లోడ్స్ వేలల్లో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏది ప్రభుత్వం ఆధీనంలో ఉన్నదో తెలియడం లేదని పలువురు ‘దిశ’కు ఫోన్లు చేశారు.
పైగా ఏ యాప్ డౌన్ లోడ్ చేసినా వ్యక్తిగత సమాచారాన్ని మొదట అడుగుతుంది. దీని వల్ల భవిష్యత్తులో కలిగే నష్టాలకు బాధ్యులెవరన్న ప్రశ్న తలెత్తుతుంది. పైగా రెవెన్యూ అధికారులు ప్రచారంలో ఉంచిన లింకు ఆధారంగా ధరణి తెలంగాణ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నా ప్రైవేటు యాప్స్ కంటే హీనంగా కనిపిస్తున్నది. చిన్న చిన్న కంపెనీల యాప్స్ కంటే ఘోరంగా యాడ్స్ ఉంటున్నాయి. అనేక యాప్స్ ల లింకులు తప్పనిసరిగా క్లిక్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నోటిఫికేషన్ల పేరిట వీడియో గేమ్స్ ఉన్నాయి. ప్రభుత్వం రూపొందించినదేనా? ఐతే ఇంత ఘోరంగా ఉంటుందా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రభుత్వం అరచేతిలో మీ ఆస్తుల సమాచారం అన్న కాన్సెప్ట్ బాగానే ఉన్నది. కానీ పబ్లిక్ డొమెయిన్ లోకి తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం విడ్డూరంగా కనిపిస్తోంది.
అనవసర లింకులు..
రెవెన్యూ అధికారులు పౌర సమాజం భూముల వివరాల లెక్క చూసుకునేందుకు, పరిశీలించేందుకు ప్రభుత్వం రూపొందించిన యాప్ ఇదేనంటూ https://dharani.telangana.gov.in/Citizen లింక్ ను పంపిస్తున్నారు. దీన్ని స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకుంటే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళన కలుగుతోంది. వ్యక్తిగత సమాచారమంతా ప్రైవేటు కంపెనీలకు వెళ్తుందన్న ప్రశ్నలు తలెత్తేటట్లుగా యాప్ ఉంది. ప్రభుత్వం రూపొందించిన ధరణి సిటిజన్ యాప్ ఓపెన్ చేయగానే ‘ప్లే క్విజ్, స్టార్ట్, మేడ్ ఇండియా యాప్స్, గవర్నమెంట్.జాబ్ న్యూస్, మేడ్ ఇన్ ఇండియా యాప్స్, స్టార్ గుర్తు, దంపతుల చిహ్నం వంటివి దర్శనమిస్తున్నాయి. ఇంకా కిందికి వెళ్తే ర్యాంప్ కార్ జంపింగ్ గేమ్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకొమ్మంటున్నది. కింద ప్రైవసీ పాలసీ ఆప్షన్ ఉంది. ఇందులో ఏది క్లిక్ చేసినా డేంజర్ గానే కనిపిస్తుంది. అవసరం కంటే అనవసరమైన అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా యాప్ డౌన్ లోడ్ చేయగానే మొబైల్ నంబరు అడుగుతుంది. వచ్చిన ఓటీపీని టైప్ చేస్తేనే ప్రొసీడ్ ఆప్షన్ వస్తుంది. జీవన్ సాతి.కామ్, ఫ్రీ ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్, జోష్-మేడ్ ఇన్ ఇండియా, చింగారి-ఇండియన్ వీడియో యాప్, సూపర్- ఎక్స్ ఫ్రీ వీపీఎన్ బూస్ట్ వంటి అనేక యాప్స్ అడ్డు తగులుతున్నాయి. చిన్నారులకే కాదు.. పెద్దలనూ ఇబ్బంది కలిగించే యాప్స్ ఉన్నాయి.
మరో క్లిక్ కు ప్రశ్నలు..
యాప్ లో ఇంకో క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అంటూ వస్తున్నాయి. దాంట్లో నాలుగు ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి, 400 పేటీఎం నగదు గెలవండి, మొబైల్ నుంచి డబ్బు సంపాదించడానికి చీమ.. మీకు యాప్ నచ్చిందా, వెల్ కం టూ ధరణి యాప్ అంటూ దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి.. వీట్లో ఏది క్లిక్ చేయాలో? ఏది క్లిక్ చేస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనన్న సందేహం వ్యక్తమవుతోంది. నోటిఫికేషన్ లోనైతే అనేక రకాల గేమ్స్ యాప్స్ ఉన్నాయి. ఎన్ని నోటిఫికేషన్లు ఉన్నాయో కూడా సంఖ్యను సూచిస్తున్నది. ప్రభుత్వమే ఏవైనా నోటిఫికేషన్లు జారీ చేసిందేమోనని క్లిక్ చేస్తే బండారం బయట పడుతుంది.
ప్రైవసీ పాలసీ..
ప్రభుత్వం రూపొందించిన ధరణి యాప్ లోని ప్రైవేటు పాలసీలో థర్డ్ పార్టీ కంపెనీల యాడ్స్ ను ఆమోదిస్తామని పేర్కొన్నారు. మీరేదైనా సమాచారం కోసం సెర్చ్ చేస్తే కనిపిస్తాయన్నారు. గూగుల్ అడ్వర్టయిజింగ్ ఐడీతో ఉంటాయంటూ వివరాలు ఇచ్చారు. ఐతే ప్రభుత్వ యాప్ లో ప్రైవేటు యాడ్స్ ఆమోదించడం విడ్డూరంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఐటీలో మేటి. ప్రపంచమే అబ్బురపరిచే శాస్త్ర సాంకేతిక నైపుణ్యం ఉన్నది. అలాంటి ఐటీ నిపుణులు, ఉద్యోగులు ఉన్నారు. కానీ ప్రపంచంలోని నలుమూలలా విస్తరించిన తెలంగాణవాసులు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా తెలంగాణ ప్రతిష్ఠ దెబ్బ తింటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇకనైనా మంచి యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఐటీ నిపుణులు, రెవెన్యూ అధికారులు, మాజీ అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారులు, విజిలెన్స్ మాజీ అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.