- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్తీని రిప్లేస్ చేసిన ధనుష్
దిశ, వెబ్‌డెస్క్ : సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ‘యుగానికి ఒక్కడు’ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాతోనే కార్తీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇది తన కెరీర్‌లోనే మైలురాయిలా నిలిచిపోగా, పదేళ్ల తర్వాత ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు దర్శకుడు. అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌లో కార్తీకి బదులు ధనుష్ హీరోగా నటించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
‘సినిమా ప్రీ ప్రొడక్షన్‌కే ఏడాది పడుతుంది. కాగా మాస్టర్ సెల్వరాఘవన్ తెరకెక్కిస్తున్న మా డ్రీమ్ ప్రాజెక్ట్ పూర్తయ్యేందుకు మరింత సమయం పడుతుంది. ఆలస్యమైనా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా రూపొందించేందుకు మేం ప్రయత్నిస్తాం.. ద ప్రిన్స్ రిటర్న్ ఇన్ 2024’ అని ధనుష్ ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు. ఇక దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు ఫిల్మ్ మేకర్స్.
తమిళ్‌లో ‘ఆయిరత్తిల్ ఒరువన్’ పేరుతో వచ్చిన ఈ సినిమా.. తెలుగులో ‘యుగానికి ఒక్కడు’గా విడుదలైంది. కార్తీ, రీమాసేన్, ఆండ్రియా ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే డిసెంబర్ 31న తమిళనాడువ్యాప్తంగా 60 థియేటర్లలో ఈ సినిమాను రీరిలీజ్ చేయగా, మంచి ఓపెనింగ్స్ రావడం విశేషం.
A magnum opus !! The pre production alone will take us a year. But a dream film from the master @selvaraghavan ! The wait will be long. But we will give our best to make it all worth it. AO2 ..The Prince returns in 2024 https://t.co/HBTXeN66iA
— Dhanush (@dhanushkraja) January 1, 2021