- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TTD News : శ్రీ కళ్యాణ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు వివరాలు ప్రకటించిన టీటీడీ

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల(Tirumala)లో వార్షిక బ్రహ్మోత్సవాల(Brahmotsavalu) వివరాలను టీటీడీ(TTD) ప్రకటించింది. ఈనెల ఫిబ్రవరి 18 నుండి 26వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరపనున్నట్టు పేర్కొంది. టీటీడీ జారీ చేసిన ప్రకటన మేరకు.. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 18 నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
*తేదీ : 18-02-2025 రోజున ఉదయం - ధ్వజారోహణం (మీనలగ్నం), రాత్రి - పెద్దశేష వాహనసేవ
*19-02-2025 రోజున ఉదయం - చిన్నశేష వాహనసేవ, రాత్రి - హంస వాహనసేవ
*20-02-2025 రోజున ఉదయం - సింహ వాహనసేవ, రాత్రి - ముత్యపుపందిరి వాహనసేవ
*21-02-2025 రోజున ఉదయం - కల్పవృక్ష వాహనసేవ, రాత్రి - సర్వభూపాల వాహనసేవ
*22-02-2025 రోజున ఉదయం - పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం), రాత్రి - గరుడ వాహనసేవ
*23-02-2025 రోజున ఉదయం - హనుమంత వాహనసేవ, సాయంత్రం - స్వర్ణరథసేవ, రాత్రి - గజ వాహనసేవ
*24-02-2025 రోజున ఉదయం - సూర్యప్రభ వాహనసేవ, రాత్రి - చంద్రప్రభ వాహనసేవ
*25-02-2025 రోజున ఉదయం - రథోత్సవం, రాత్రి - అశ్వవాహనసేవ
*26-02-2025 రోజున ఉదయం - చక్రస్నానం, రాత్రి - ధ్వజావరోహణసేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.
టీటీడీకి రెండు ద్విచక్ర వాహనాలు విరాళం...
తిరుమల శ్రీవారికి మంగళవారం చెన్నైకి చెందిన టివిఎస్, బెంగళూరుకు చెందిన ఎన్ డిఎస్ ఎకో సంస్థల ప్రతినిధులు విద్యుత్ ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించారు. టీవీఎస్ ఐ క్యూబ్ ఎక్స్ వాహనం ధర రూ.2.70 లక్షలు, ఎన్ డిఎస్ ఎకో వాహనం ధర రూ.1.56 లక్షలు అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ముందుగా అలయం వద్ద ఈ వాహనానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనం తాళాలను టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి ఆయా సంస్థల ప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీవిఎస్ చైర్మన్ శ్రీ వేణు శ్రీనివాసన్, ఎండి శ్రీ సుదర్శన్, తిరుమల డిఐ శ్రీ సుబ్రమణ్యం, ఎన్ డిఎస్ ఎకో సంస్థ చైర్మన్ ఎంహెచ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు