Maha shivratri : శివుడికి నచ్చని పనులు ఇవే.. ఇవాళ అస్సలు చేయకండి!

by Prasanna |
Maha shivratri : శివుడికి నచ్చని పనులు ఇవే.. ఇవాళ అస్సలు చేయకండి!
X

దిశ, వెబ్ డెస్క్ : సంక్రాంతి పండుగలు తర్వాత వచ్చే ముఖ్యమైన పండుగలలో మహా శివరాత్రి పండుగ ఒకటి. అన్ని పండుగలు పగటి పూట జరుపుకుంటే కానీ ఈ పండుగ మాత్రం రాత్రి పూట జరుపుకుంటాం. జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చిన పర్వదినం. శివ రాత్రి రోజు పగలు అంతా ఉపవాసం ఉండి.. మనస్సును దైవం మీద ఉంచుతూ శివును అనుగ్రహం కోసం భక్తి శ్రద్దలతో పూజలు, భజనలు చేస్తారు. అందుచేత శివ రాత్రిగా పిలవబడుతుంది.

పూజించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని చెయ్యకూడని తప్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివ అనే పేరు లోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగి ఉంది. శివుణ్ణి లింగ రుపంలో పూజించడం వలన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుతారని వేదాలు వివరిస్తున్నాయి. శివుడుకు బిల్వ పత్రం సమర్పించడం చాలా ముఖ్యం. మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ పత్రం మూడు కన్నులకు చిహ్నం. అలాగే త్రిశులానికి సంకేతం. బిల్వ పత్రాన్ని సోమవారం అమావాస్య రోజు చెట్టు నుంచి అస్సలు తియ్యకూడదు. ముక్కు పోయిన ఆకులను పెట్టకూడదు.. నీటితో శుభ్రం చేసిన తరవాత సమర్పించాలి. శివ లింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం గంధం మాత్రమే పెట్టాలి. కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివ లింగంపై పోయకూడదు. సంపంగి పూలను సమర్పించకూడదు. శివ లింగ అభిషేకానికి స్టీల్ స్టాండును ఉపయోగించకూడదు. జలధార లేకుండా శివ లింగం పెట్టుకుంటే నెగటివ్ ఎనర్జీ వస్తుందట.

Advertisement

Next Story