Shani Dev: జాతకంలో ఏలినాటి శనిదోష ప్రభావమా.. అయితే, ఈ పరిహారాలు చేయండి!

by Prasanna |
Shani Dev: జాతకంలో ఏలినాటి శనిదోష ప్రభావమా.. అయితే, ఈ పరిహారాలు చేయండి!
X

దిశ, వెబ్ డెస్క్ : గ్రహాలు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు మనుషుల జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో శనిదేవుడి ( Shani Dev ) ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. ఏలినాటి, సాడేసాతి, అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. అయితే, మనం చేసే మంచి చెడును బట్టి శని దేవుడు కర్మలను ఇస్తుంటాడు. అందుకే, మంచి మార్గంలోనే నడవాలని పండితులు కూడా చెబుతుంటారు.

ముఖ్యంగా, శనివారం రోజున కొన్ని పరిహారాలు చేస్తే శనిదోషాలు తొలగిపోతాయి. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి.. కొత్త బట్టలు వేసుకుని శని దేవుని వద్దకు వెళ్లాలి. ఆ తర్వాత, శనీ దేవుడి అనుగ్రహం కోసం తైలాభిషేకం చేయాలి. అలాగే, విధంగా నల్లని వస్త్రాన్ని శనిదేవుడికి అర్పించాలి. నల్ల నువ్వులను స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి.

నల్ల చీమలకు, కాకులు.. చక్కెర, బెల్లం వంటివి ఆహార పదార్ధాలు పెట్టాలి. శనిదేవుడి ఆశీర్వాదం కోరకు.. సూర్యారాధన చేస్తూ ఉండాలి. నిత్యం శనిదేవుడి స్తోత్రాలు, శని అష్టోత్తర నామాలు చదువుకుంటూ ఉండాలి. ఇలా ఐదు వారాల పాటు చేస్తే ఏలినాటి శనిదోషం నుంచి సులభంగా బయట పడొచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story

Most Viewed