అద్దె ఇంట్లో పాలుపొంగిచడం మంచిదేనా?పండితులు ఏం చెబుతన్నారంటే?

by Jakkula Samataha |
అద్దె ఇంట్లో పాలుపొంగిచడం మంచిదేనా?పండితులు ఏం చెబుతన్నారంటే?
X

దిశ, ఫీచర్స్ : చాలా మంది ఉద్యోగాల కోసం పల్లెను వదిలి పట్నం వస్తుంటారు. ఇక మంచి జీతం, ఖర్చులన్నీ పోను ఎంతో కొంత డబ్బును ఆదా చేసుకోగలం అనే నమ్మకం వచ్చినప్పుడు, పట్నంలోనే ఫ్యామిలీ పెట్టేస్తారు. దీంతో ఏదో ఒక ఇంట్లోకి అద్దెకు వెళ్తుంటారు. అయితే చాలా మంది అద్దె ఇంట్లోకి కొత్తగా వెళ్తున్నప్పుడు, పాలు పొంగించడం లాంటిది చేస్తారు. అయితే అసలు అది మన ఇళ్లు కాదు, మనం కొత్తగా ఇళ్లు కట్టుకోలేదు, ఎవరో కట్టిన ఇంట్లోకి మనం వెళ్లి పాలు పొగించడం మంచిదేనా అనే డౌట్ చాలా మందికి వస్తుంటుంది. కాగా, ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.

అద్దె ఇంట్లో పాలు పొంగించడం మంచిదేనా అంటే, అస్సలే శుభ ప్రదం కాదు అంటున్నారు పండితులు. అద్దె ఇంట్లోకి మారాలి అనుకునే వారు, శ్రావణం, ఆషాఢంల, భాద్రపదం వంటి మాసల్లో మారితే మంచిది. కానీ అద్దె ఇంట్లోకి మారినప్పుడుమాత్రం అస్సలే పాలు పొంగించకూడదు, దీని వలన మీ సొంత ఇంటి కల నెరవేరే అవకాశం చాలా తక్కు అని చెబుతున్నారు. అంతే కాకుండా, అద్దె ఇంట్లో పాలు పొంగియ్యడం వలన ఆ ఫలితం ఆ యజమానికే వెళ్తుంది, మీకు ఎలాంటి మంచి జరగదు, అద్దె ఇంట్లోకి కేవలం వారం తిథి చూసుకొని వెళ్తే చాలు, పాలు పొంగించాల్సిన అవసరం లేదు అని వారు చెబుతున్నారు. ( నోట్ : ఇది, ఇంటర్నెట్, నిపుణల సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు)

Advertisement

Next Story

Most Viewed