- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రాజన్న’కూ తప్పని తిప్పలు.. అంతా ఆన్‌లైన్ మయం!
దిశ, వేములవాడ : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంపై కరోనా ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. వేములవాడలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండటంతో భక్తులకు ఆలయ దర్శనాన్ని నిలిపివేశారు. ఇక నుంచి దర్శనం కూడా ఆన్‌లైన్ ద్వారానే చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం ఆన్ లైన్‌లోనే స్వామి వారి ఆర్జిత సేవలు వినియోగించుకోవచ్చునని ఆలయ ఏఈవో హరికిషన్ తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 18 నుంచి 24 వరకు రాములోరి ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ నెల 21న శ్రీ రామనవమి సందర్భంగా సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం జరగనుంది.
కరోనా సెకండ్ వెవ్ నేపథ్యంలో భక్తులు లేకుండానే కల్యాణ మండపంలో ఏకాంతంగా పూజలు నిర్వహించనున్నారు. ఈ నాలుగు రోజులు ఆలయంలో అర్జిత సేవలతో పాటు దర్శనాలు, ధర్మశాల అద్దెలు నిషేధించారు. భక్తులకు ఆన్లైన్లో టీఎస్ మీసేవ 2.0 లేదా టీ ఆప్ ఫోలియో ద్వారా అర్జిత సేవల రుసుము చెల్లించి, భక్తుల గోత్ర నామాల మీద మొక్కులు చెల్లించుకునేలా ఆలయాధికారులు ఆవకాశం కల్పించారు. కరోనా నేపథ్యంలో స్వామి వారి కల్యాణం ఆన్లైన్లో ఆర్జిత సేవలు చేసి తరలించాలనీ, ఆలయానికి రాకుండా భక్తులు అధికారులకు సహకరించాలని కోరారు.