- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెస్ట్ క్రికెట్‌లో డెవాన్ కాన్వే సంచలన రికార్డు
దిశ, స్పోర్ట్స్ : న్యూజీలాండ్ జట్టు ఓపెనర్ డెవాన్ కాన్వే లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో చరిత్ర సృష్టించాడు. తొలి రోజు సెంచరీ నమోదు చేసి అరంగేట్రం మ్యాచ్‌లోనే ఈ ఫీట్ సాధించిన అతి కొద్ది మందిలో ఒకడిగా నిలిచాడు. ఇక రెండో రోజు 246/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజీలాండ్‌కు ఓపెనర్ కాన్వేనే పెద్ద దిక్కుగా మారాడు. ఓవర్ నైట్ స్కోర్‌కు 42 పరుగులు జోడించిన తర్వాత హెన్రీ నికొలస్ (61) మార్క్‌వుడ్ బౌలింగ్‌లో ఓలీ రాబిన్‌సన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత కాన్వేకు ఒక్కరు కూడా తోడుగా నిలవలేదు. కానీ డేవాన్ కాన్వే మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. వాట్లింగ్ (1), కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (0), మిచెల్ సాంట్నర్ (0), కేల్ జేమిసన్ (9), టిమ్ సౌథీ (8) వికెట్లు వరుసగా కోల్పోయింది.
కానీ డేవన్ కాన్వే, నీల్ వాగ్నర్ కలసి 10వ వికెట్‌కు 40 పరుగులు జోడించారు. కాన్వే ఒంటరి పోరాటం చేసి డబుల్ సెంచరీ సాధించాడు. 347 బంతుల్లో 22 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 200 పరుగులు చేశాడు. తొలి రోజు బౌండరీతో సెంచరీ పూర్తి చేసుకున్న కాన్వే, రెండో రోజు సిక్సుతో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే ఆ తర్వాత అనవసరమైన పరుగుకు ప్రయత్నించి కాన్వే (200) రనౌట్ అయ్యాడు. నీల్ వాగ్నర్ (25) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో న్యూజీలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 122.4 ఓవర్లలో 378 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 18 పరుగులకే ఓపెనర్ డామ్ సిబ్లే (0), జాక్ క్రాలీ (2) వికెట్లను కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ రోరీ బర్న్స్ (59 నాటౌట్), కెప్టెన్ జో రూట్ (42 నాటౌట్) కలసి మరో వికెట్ పడకుండా రెండో రోజు ఆట ముగించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది.
అరంగేట్రం టెస్టులోనే డబుల్ సెంచరీ సాధించిన ఆరో క్రికెటర్‌గా కాన్వే రికార్డులకు ఎక్కాడు. అంతకు ముందు టిప్ ఫోస్టర్(287), జాక్ రుడాల్ఫ్(222*), లారెన్స్ రోవ్(214), మాథ్యూ సింక్లెయిర్(214), బ్రెండన్ కురుప్పు(201*)లు అరంగేట్రం మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేశారు. ఇక ఈ ఘనత సాధించిన రెండో కివీస్ ప్లేయర్‌గా కాన్వే రికార్డు సాధించాడు. అంతకు ముందు మాథ్యూ సింక్లెయిర్ ఆ ఘనత సాధించాడు. ఇక తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లాండ్‌పై అత్యధిక స్కోర్ సాధించిన రంజిత్ సిన్హాజీ (154 నాటౌట్) రికార్డును కాన్వే అధిగమించాడు. బ్రిటిష్ ఇండియా తరపున ఆడిన రంజిత్ సిన్హాజీ 1896లో ఇంగ్లాండ్‌పై 154 పరుగులు చేశాడు.