బాలీవుడ్‌లో రాక్‌స్టార్.. సల్మాన్‌తో ‘సీటీమార్’ స్టెప్పులు

by Shyam |
బాలీవుడ్‌లో రాక్‌స్టార్.. సల్మాన్‌తో ‘సీటీమార్’ స్టెప్పులు
X

దిశ, సినిమా : సంగీతానికి హద్దులు, భాషా బేధాలంటూ ఏమీ ఉండవు. బీట్ నచ్చితే చాలు.. అది ఏ స్టేట్ అయినా మోత మోగాల్సిందే. రికార్డులు కొల్లగొట్టడంతో పాటు అత్యధిక వ్యూస్ సాధించాల్సిందే. అలాంటి మ్యూజిక్ అందించే సంగీత దర్శకుల్లో టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. క్యాచీ ట్యూన్స్, మాస్ నంబర్స్‌తో ఉర్రూతలూగించే దేవి.. సినిమాకు అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న ఈ రాక్‌స్టార్.. తాజాగా బాలీవుడ్ సినిమాకు సాంగ్ కంపోజ్ చేయడం విశేషం.

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’లో ‘సీటీమార్’ సాంగ్ రీమేక్ చేశాడు దేవి. అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించిన ‘డీజే’ సినిమాలోని పాట సూపర్ హిట్ కాగా, ఇదే ట్యూన్‌ను ‘రాధే’ సినిమాకు ఇచ్చాడు. ఈ సాంగ్‌ను ఆదివారం విడుదల చేయనున్నట్లు ‘రాధే’ మూవీ యూనిట్ తెలిపింది. మరి ‘సీటీమార్’ సాంగ్‌కు సల్మాన్ ఖాన్, దిశా పటానీ ఎలాంటి స్టెప్పులు వేస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే నెల 13న ఓటీటీతో పాటు థియేట్రికల్ రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్రభుదేవా డైరెక్టర్. చిత్రంలో రణ్‌దీప్‌ హుడా విలన్ రోల్ ప్లే చేస్తుండగా, జాకీ ష్రాఫ్ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. అయితే దేవిశ్రీ గతంలో సల్మాన్ కిక్ సినిమాలోనూ ‘డింక్ చకా’ అనే సాంగ్ కంపోజ్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story