- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మణికొండలో పడకేసిన అభివృద్ధి, పత్తాలేని అధికారులు

దిశ, గండిపేట్ : మణికొండ మున్సిపాలిటీలో అభివృద్ధి పడకేసింది. పట్టించుకోవాల్సిన అధికారుల జాడ లేకపోవటంతో సమస్యలు అలాగే ఉంటున్నాయి. మున్సిపాలిటిలో అందుబాటులో ఉండాల్సిన మేనేజర్ బదిలీ కావటం.. నూతన మేనేజర్‌ను నియమించకపోవడంతో సమస్యలు పెరిగిపోతున్నాయనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. నగర శివారులో మణికొండ మున్సిపాలిటి అభివృద్ధిలో దూసుకుపోతుందనే విషయం అందరికీ తెలిసిందే. అయినా చిన్న చిన్న కారణాలతో అభివృద్ధిని దారి తప్పిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేకపోయినా కనీసం మున్సిపల్ మేనేజర్ అందుబాటులో ఉండాలి. దీంతో నూతన మేనేజర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తారని, తమ సమస్యలు ఎప్పుడు తీరుస్తారో అని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రోజుల తరబడి మేనేజర్ లేకుండానే పని చేస్తుండడంతో మున్సిపల్ సిబ్బందికి పని భారం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. నూతన మేనేజర్ అవసరం ఉందన్న విషయం తెలిసి కూడా ఉన్నతాధికారులు ఎందుకు కేటాయించడం లేదోనని మున్సిపల్ సిబ్బంది అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. కనీసం వేరోవరికైన ఇంఛార్జి బాధ్యతలు ఇస్తే సమస్యలు కొంతవరకు తగ్గుతాయని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు.